Movie News

ఎస్పీ బాలు.. గండం గడిచినట్లేనా?

గత కొన్ని వారాలుగా దక్షిణాది సంగీత ప్రియులకు రోజులు చాలా భారంగా, ఆందోళనకరంగా గడుస్తున్నాయి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడటం.. ఒక దశలో ఆయన పరిస్థితి విషమించడమే అందుక్కారణం. వెంటిలేటర్ ద్వారా ఆయనకు శ్వాస అందించాల్సి రావడం, రోజుల తరబడి అదే పరిస్థితి కొనసాగడం, ఒక దశలో బాలు బతకడం కష్టమే అన్నట్లు వార్తలు రావడంతో తీవ్ర ఆందోళన, ఆవేదన నెలకొంది సంగీత ప్రియుల్లో.

తన పాటల ద్వారా బాలు పంచిన ఆనందం ఎలాంటిదో ఆయన అభిమానులకు తెలుసు. అందుకే ఆయన అనారోగ్యం పాలై పరిస్థితి విషమించగానే తట్టుకోలేకపోయారు. వారి ఆందోళన గమనించే బాలు తనయుడు రోజు వారీ అప్ డేట్లు ఇస్తూ వచ్చాడు. కొన్ని రోజుల కిందట బాలు విషమ స్థితి నుంచి బయటపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ ప్రమాదం మాత్రం తొలగిపోలేదు.

యథాతథ స్థితి కొనసాగుతుండటంతో బాలు ఆరోగ్యం గురించి కొత్త అప్ డేట్స్ ఏమీ లేకపోయాయి. ఐతే బాలు పూర్తిగా కోలుకున్నారు, డిశ్చార్జ్ కాబోతున్నారు అనే వార్త కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు దగ్గర పడ్డట్లు కనిపిస్తోంది. తాజా అప్ డేట్‌లో ప్రశాంతంగా కనిపించిన ఎస్పీ చరణ్.. అంతా అనుకూలిస్తే వచ్చే సోమవారం బాలు గురించి శుభవార్త వింటామని అన్నాడు.

ఈ అప్ డేట్ బాలు అభిమానులకు అమితానందాన్ని కలిగించింది. సోమవారం శుభవార్త అంటే.. బాలు పూర్తిగా కోలుకున్నారు, డిశ్చార్జ్ కాబోతున్నారు అన్నదే అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలు ప్రస్తుతం మామూలుగా మాట్లాడుతున్నారని.. పూర్తి తెలివితో ఉన్నారని.. అప్పుడప్పుడూ వెంటిలేటర్ కూడా తీస్తున్నారని వార్తలొస్తున్నాయి. బాలు ప్రస్తుతం ఆసుపత్రి నుంచి పాడినట్లుగా ఒక పాట కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండటం విశేషం.

This post was last modified on September 5, 2020 8:50 am

Share
Show comments
Published by
Satya
Tags: SP Babu

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

2 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

5 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

6 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

6 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago