Movie News

మోహన్ లాల్ సినిమాకు తెలుగు కష్టాలు

మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్ కొనసాగిస్తున్న మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. 90 దశకంలో తన డబ్బింగ్ సినిమాలు చాలానే ఇక్కడ ఆడాయి. మనమంతాతో స్ట్రెయిట్ టాలీవుడ్ డెబ్యూ చేశాక ఆశించిన ఫలితం దక్కలేదు కానీ మంచి పేరైతే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ లో నటించాక మొదటి బ్లాక్ బస్టర్ ఖాతాలో పడింది. దీని తర్వాత లూసిఫర్ తో సహా చాలా చిత్రాలు అనువదించి రిలీజ్ చేశారు కానీ అవేవి కనీస స్థాయిలో ఆడియన్స్ కు రీచ్ కాలేకపోయాయి. ఇప్పుడు ఇంకోటి వస్తోంది.

మలైకొట్టయి వాలిబన్ జనవరి 25 ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ కి లిజో జోస్ పెల్లిషెర్రీ దర్శకత్వం వహించాడు. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ లో ఆలస్యం జరిగింది. అయితే ఇక్కడి బయ్యర్లు దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదని ట్రేడ్ టాక్. ఎందుకంటే అదే రోజున ధనుష్ కెప్టెన్ మిల్లర్ ని సురేష్, ఏషియన్ సంస్థలు జాయింట్ గా విడుదల చేస్తున్నాయి. అదే రోజు వస్తున్న హృతిక్ రోషన్ ఫైటర్ కి ఏపీ, తెలంగాణలో మంచి ప్లానింగ్ జరుగుతోంది. 26న శివ కార్తికేయన్ ఆయలాన్ వచ్చేస్తాడు.

ఇంత కాంపిటీషన్ కు తోడు హనుమాన్ జోరు అప్పటికి తగ్గే సూచనలు లేకపోవడం, నా సామిరంగ, గుంటూరు కారంల కొనసాగింపు లాంటి అంశాలు మలైకోట్టై వాలిబన్ కు ప్రతిబంధకంగా నిలుస్తాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేయాలనీ చూస్తున్న మోహన్ లాల్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట. దీని కన్నా ఒక వారం వాయిదా వేసి ఫిబ్రవరి మొదటి వారంలో వస్తే బాగుంటుందనే ఆలోచన జరుగుతోంది కానీ దానికన్నా ఏదైతే అదయ్యిందని పోటీలో రావడానికే ఫిక్స్ అవ్వొచ్చట. హీరో తప్ప మనకు పరిచయమున్న ఆరిస్టులు ఇందులో ఎవరూ లేరు. మొత్తం కేరళ బ్యాచే.

This post was last modified on January 18, 2024 8:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

29 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

49 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

1 hour ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

1 hour ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago