Movie News

విజయ్ దేవరకొండ 12 ఆగదు ఆగలేదు

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ హఠాత్తుగా ఆగిపోయిందనే ప్రచారం మొదలవ్వడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. ఎందుకంటే ఇది అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ టాక్. రెండు రోజుల క్రితం పండగ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ప్రకటనలో దీని హక్కులు కొన్నట్టు స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తేనే ఇంత ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తారు. సో క్యాన్సిలన్నది పుకారుగానే చూడాలి. 

ప్రస్తుతం విజయ్ చిన్న బ్రేక్ తీసుకున్నా ముందు ఫ్యామిలీ స్టార్ పూర్తి చేయాలి. ఫారిన్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో సంక్రాంతి సీజన్ మిస్ అయిన ఈ ఎంటర్ టైనర్ కి పరుశురాం దర్శకుడు. దీని కోసమే సితార సంస్థ విడి 12 షూటింగ్ ని వాయిదా వేసుకుంది. ఈలోగా గౌతమ్ తిన్ననూరి అంతా కొత్తవాళ్లతో ఇంకో సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే బిజీగా తిరుగుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూరుస్తున్నాడు. రీ రికార్డింగ్ ని వీలైనంత వేగంగా ఇస్తానని మాట ఇవ్వడంతో ఇద్దరూ దాని మీదే బిజీగా ఉన్న మాట వాస్తవం. 

ఫిబ్రవరి నుంచి విడి 12 రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. నిర్మాత నాగవంశీ గతంలోనే ఇది చాలా పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అవుతుందని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. కానీ గుంటూరు కారం ఒత్తిడి, రిలీజ్ వ్యవహారాలతో బిజీగా ఉండి విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తావన ఎక్కడా రాలేదు. త్వరలో ఎలాగూ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, టిల్లు స్క్వేర్ ప్రమోషన్ల కోసం అందుబాటులోకి వస్తారు కాబట్టి అప్పుడీ గాసిప్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఖుషి ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితం అందుకోకపోవడంతో విజయ్ ఆశలన్నీ ఈ రెండు సినిమాల మీదే ఉన్నాయి. 

This post was last modified on January 17, 2024 11:22 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago