తెలుగు సినిమాలు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే అనడంలో మరో మాట లేదు. రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి టాక్ వస్తే మామూలుగా వచ్చేదాంతో పోలిస్తే 20 30 శాతం అదనపు వసూళ్లు వస్తాయి. అలవైకుంఠ పురములో, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు వాటి స్థాయిని మించి వసూళ్ల మోత మోగించాయంటే అందుకు కారణం సంక్రాంతికి రిలీజ్ కావడమే.
అందుకే ఈ పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారు. చాలా ముందు నుంచే బెర్తులు బుక్ చేసుకుంటారు. అయితే సంక్రాంతికి హిట్ టాక్ వస్తే అదనపు వసూళ్లు రావడం నిజమే కానీ.. ఈ టైంలో పోటీ ఎక్కువ ఉంటే థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కవు. దీనికి తోడు టాక్ తేడా కొట్టిందంటే దారుణంగా దెబ్బతింటుందా సినిమా.
సంక్రాంతి మీద భారీ ఆశలతో రిలీజ్ అయ్యి దారుణంగా దెబ్బతిన్న సినిమాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఓపెనింగ్స్ వరకు ఓ మోస్తరుగా రాబట్టి.. పోటీలో ఉన్న మిగతా సినిమాలో దూకుడు ముందు వెలవెలబోయి అడ్రస్ లేకుండా పోయాయి ఆ చిత్రాలు. గత కొన్నేళ్ళలో పరిస్థితి గమనిస్తే.. ఎన్టీఆర్ కథానాయకుడు, అజ్ఞాతవాసి, ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఇక ఈ ఏడాది సైంధవ్ ఈ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలన్నింటిలోకి బ్యాడ్ టాక్ తెచ్చుకున్నది ఇదే.
హనుమాన్ బెస్ట్ టాక్ తో ప్రభంజనం సృష్టిస్తుండగా.. గుంటూరు కారం, నా సామిరంగ ఓ మోస్తరుగా ఆడుతున్నాయి. కానీ సైంధవ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సినిమా ఏ దశలోనూ పికప్ కాలేదు. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రమే వచ్చాయి. వేరే సినిమాల ఓవర్ ప్లోస్ తో కొంత వరకు నడిచింది కానీ.. అంతిమంగా సినిమా డిజాస్టర్ అని చెప్పాలి. కాబట్టి క్రేజీ సీజన్ అని సంక్రాంతికి రిలీజ్ చేయడం బాగానే ఉంది కానీ కంటెంట్ విషయంలో కొంచెం ముందు వెనక చూసుకుంటే బెటర్.
This post was last modified on January 16, 2024 9:27 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…