ఇది చిన్న సినిమా కదాని ఇండస్ట్రీ పెద్దలతో అనిపించుకున్న హనుమాన్ వారం రోజులు తిరక్కుండానే 100 కోట్ల గ్రాస్ సాధించింది. తేజ సజ్జ లాంటి అప్ కమింగ్ హీరోతో ఈ ఫీట్ సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగిపోతోంది. తీసుకున్నది ఫాంటసీ జానరే అయినప్పటికీ దాన్ని కనెక్ట్ అయ్యేలా చెప్పిన విధానం, భక్తిని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఊపేస్తోంది. ఓవర్సీస్ లో ఏకంగా మూడు మిలియన్ మార్క్ దాటడం గురించి అక్కడి ట్రేడ్ వర్గాలు షాక్ తిన్నాయి. లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం.
ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్నున్నాయి. హీరో స్థాయి చిన్నా పెద్దా ఏదైనా కావొచ్చు. ముందు కంటెంట్ ముఖ్యం. కేవలం గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆడే పనైతే చిరంజీవి అంజి చరిత్ర సృష్టించాలి. కానీ ప్రశాంత్ వర్మ చేసి చూపించాడు. కోడి రామకృష్ణ గారంత అనుభవం లేకపోయినా ఇప్పటి ఆడియన్స్ పల్స్ మీద పట్టు సాధించాడు. బడ్జెట్ ని కంట్రోల్ లో పెడుతూనే విజువల్ ఎఫెక్ట్స్ శభాష్ అనిపించుకునేలా ఎలా వాడాలో ఒక ఉదాహరణగా నిలిచాడు. ఈ మూవీ మేకింగ్ మీద ప్రత్యేకంగా వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందని ఫిలిం మేకర్స్ కోరుతున్నారు.
ప్రేక్షకులు క్యాస్టింగ్ ని పట్టించుకుంటారనే భ్రమలను గత ఏడాది బలగం తొలగిస్తే ఇప్పుడు హనుమాన్ దాన్ని బలపరిచింది. రెండు సినిమాల్లో మాట్లాడింది కథా కథనాలే తప్ప హీరోలు కాదు. సంగీతం విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ కూడా ప్రశాంత్ వర్మ టేస్ట్ లో కనిపించింది. సగటు జనాలకు అంతగా పరిచయం లేని గౌర హరితో గూస్ బంప్స్ వచ్చేలా బీజీఎమ్ రాబట్టుకోవడం చిన్న విషయం కాదు. ఆ టాలెంట్ ని పసిగట్టడమూ తెలివే. బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చు పెట్టకపోయినా మాయాజాలం చేసిన హనుమాన్ ఫైనల్ రన్ ,లోపు ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి.
This post was last modified on January 16, 2024 8:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…