ఒక పెద్ద హీరోతో హిట్టు కొట్టిన దర్శకుడు తన తర్వాతి సినిమా కోసం ఇంకో పెద్ద హీరో వైపే చూస్తాడు. స్టార్ హీరోలు సైతం ఇలాగే దర్శకులను పంచుకుంటూ ఉంటారు. గతంలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలామంది అగ్ర దర్శకులతో మార్చి మార్చి సినిమాలు చేశారు. చిరుతో సినిమా చేశాక బాలయ్యతో.. బాలయ్యతో చిత్రం చేశాక చిరుతో జట్టు కట్టిన దర్శకులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది.
గత ఏడాది సంక్రాంతికి చిరుకు వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఇచ్చిన బాబి ప్రస్తుతం బాలయ్యతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మరో దర్శకుడు ఇదే ఒరవడి కొనసాగించబోతున్నాడు. అతనే వశిష్ఠ. బింబిసారతో ఘనవిజయాన్ని అందుకుని ప్రస్తుతం చిరుతో విశ్వంభర చేస్తున్న వశిష్ఠ.. తన తర్వాతి సినిమాను బాలయ్యతో చేసే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.
బింబిసార తర్వాత తాను ముందుగా బాలయ్యనే కలిసి ఓ కథ వినిపించానని. ఆయనకు అది నచ్చిందని.. అయితే ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ల తర్వాత ఆ సినిమా చేస్తానని చెప్పాడని ఓ ఇంటర్వ్యూలో వశిష్ఠ వెల్లడించాడు. విశ్వంభర తర్వాత తాను బాలయ్యతో ఆ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు చెప్పాడు. అది ఒక కొత్త జానర్లో, మ్యాజికల్ గా ఉంటుందని.. అందులోనూ ఫాంటసీ టచ్ ఉంటుందని చెప్పి బాలయ్య అభిమానులను ఊరించాడు వశిష్ఠ.
This post was last modified on January 16, 2024 3:11 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…