టాలీవుడ్లో అక్కినేని నాగార్జున అందరూ మన్మధుడు అంటారు. ఆ మాట అతిశయోక్తిలా అనిపించదు. మన్మధుడు అనే టైటిల్ పెట్టుకుని సినిమా చేస్తే.. ఆ టైటిల్ కు నూరు శాతం అర్హుడు అనిపించాడు అక్కినేని హీరో. ఇప్పుడు ఆయన వయసు పెరిగి ఉండొచ్చు. కానీ యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా ఫిట్నెస్, గ్లామర్ మెయింటైన్ చేయడం నాగార్జునకే సొంతమైంది. గత కొన్నేళ్లుగా నాగార్జున సినిమాలు సరిగా క్లిక్ కాకపోతుండొచ్చు కానీ ఆయన ఫిజిక్, గ్లామర్ విషయంలో మాత్రం వంక పెట్టడానికి లేదు.
తెరమీద నాగ్ ఉంటే హీరోయిన్లను మించి హైలైట్ అవుతుంటారు. ఇలాంటి హీరోను అందం, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ విషయంలో డామినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కన్నడ అమ్మాయి ఆషికా రంగనాథ్ అదే పని చేసింది నా సామిరంగ చిత్రంలో. నా సామి రంగ విడుదలకు ముందే ఆషికా రంగనాథ్ తన అందం హావభావాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
తన గురించి అందరూ మాట్లాడుకున్నారు. తెలుగులో చేసిన తొలి చిత్రం అమిగోస్ పెద్దగా ఇంపాక్ట్ వేయనప్పటికీ నా సామి రంగకు వచ్చేసరికి ఆమెకు మంచి రోల్ పండిందని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఇక సినిమా చూశాక ఆషిక అందరిని కట్టిపడేసింది. తన అందం హైలైట్ అయ్యేలా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎక్కువగా లంగా వోణీ, చీరలోనే చూపించడం ప్లస్ అయింది.
దీనికి తోడు ఆషిక స్క్రీన్ ప్రెజెన్స్, నటన కూడా ఆకట్టుకోవడం.. తన పాత్రలోనూ బలం ఉండడంతో వరాలు పాత్ర బాగా క్లిక్ అయింది. తెరమీద ఆషిక కనిపిస్తే చూస్తూనే ఉండాలని అనిపించేలా తన పాత్ర, అప్పీయరెన్స్ ఉండడంతో అందరూ తన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె నాగార్జునను సైతం కొన్ని సన్నివేశాల్లో డామినేట్ చేయడం విశేషం. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఆషిక టాలీవుడ్లో త్వరలోనే బిజీ హీరోయిన్ అయిపోయేలా కనిపిస్తోంది.
This post was last modified on January 15, 2024 11:26 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…