తక్కువ గ్యాప్ లో విడుదలవుతున్న రెండు పెద్ద సినిమాలు ఒకే జానర్ కు సంబంధించినవి అయితే పోలికల పరంగా పెద్ద చిక్కొచ్చి పడుతుంది. వచ్చే నెల ఫిబ్రవరి 16 వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ రిలీజవుతోంది. సోనీ సంస్థ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. వాస్తవానికి డిసెంబర్ లోనే వద్దామనుకున్నారు కానీ సలార్ వల్ల ప్లానింగ్ మొత్తం మారిపోయింది. లేదంటే ఈపాటికి ఓటిటి స్ట్రీమింగ్ కూడా జరిగిపోయేది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ వార్ డ్రామాలో మానుషీ చిల్లార్ హీరోయిన్ గా తెలుగుకు పరిచయమవుతోంది. నెల క్రితం వచ్చిన టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
సమస్య ఏంటంటే జనవరి 25 హృతిక్ రోషన్ ‘ఫైటర్’ వస్తోంది. పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రోడక్ట్ కావడంతో బిజినెస్ చాలా క్రేజీగా జరుగుతోంది. డంకీ ఆశించిన కిక్ ఇవ్వకపోవడంతో జవాన్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఓపెనింగ్స్, వసూళ్లు దీనికే వస్తాయని నార్త్ ట్రేడ్ ధీమాగా ఉంది. అయితే ఫైటర్ బ్యాక్ డ్రాప్ కూడా ఎయిర్ ఫోర్స్ లోనే ఉంటుంది. ఇక్కడ వరుణ్, అక్కడ హృతిక్ ఇద్దరూ పైలట్లే. శత్రు దేశం పాకిస్థాన్ వల్ల ముప్పు తలెత్తితే ఆ మిషన్ తాలూకు బాధ్యతను తీసుకుని ప్రాణాలకు తెగించడం కామన్ పాయింట్ గా కనిపిస్తోంది. కాకపోతే ట్రీట్ మెంట్ మాత్రం వేరుగా ఉంటుంది.
ట్రైలర్ చూస్తే ఫైటర్ లో ఏ రేంజ్ యాక్షన్ విజువల్స్ ఉన్నాయో అర్థమవుతోంది. ఆపరేషన్ వాలెంటైన్ కూడా రాజీ పడలేదు కానీ ముందొచ్చే హృతిక్ హిట్టు కొడితే మాత్రం సహజంగానే కంపారిజన్లు వచ్చి లేనిపోని మీమ్స్ మొదలవుతాయి. రెండు కథలు ఒకటే కాకపోయినా జెట్ విమానాలు వేసుకుని హీరోలు యుద్ధాలు చేస్తారు కాబట్టి ఎంత వద్దనుకున్నా సారూప్యత కనిపిస్తుంది. వరుణ్ తేజ్ టీమ్ ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకుంది. కాకపోతే ఫైటర్ ప్రస్తుతానికి హిందీ వెర్షన్ ఒకటే అంటోంది. ఒకవేళ ఈ వారంలోపు ఏమైనా నిర్ణయం మారి డబ్బింగ్ కి ఎస్ అంటుందేమో చూడాలి.
This post was last modified on January 15, 2024 5:09 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…