పండగ సినిమాల్లో ఆఖరిగా విడుదలైన నా సామిరంగ టాక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత నాగార్జున చిత్రానికి తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేస్తే అవన్నీ ఫుల్ కావడం ఎప్పుడో కొన్నేళ్ల క్రితం జరిగేది కానీ మళ్ళీ ఇప్పుడు సాధ్యమయ్యింది. రేంజ్ గురించి, బాక్సాఫీస్ ఫిగర్స్ గురించి అప్పుడే చెప్పలేం కానీ నిరాశ పరచని విధంగా రివ్యూలు, పబ్లిక్ టాక్ అయితే వచ్చేశాయి. నాగార్జున, అల్లరి నరేష్ ల బాండింగ్ తో పాటు మాస్ కి కావాల్సిన మసాలా ఫైట్లని తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చేలా చేసుకుంది.
దీనికి మంచి దొంగకు కనెక్షన్ ఏంటంటే పాయింట్ కు వద్దాం. నా సామిరంగ కథ ప్రకారం 1988లో జరుగుతుంది. ఓ సందర్భంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి టౌన్ లో ఉన్న థియేటర్ లో ఈ సినిమాకు వెళ్తారు. టికెట్లు దొరక్క లేడీస్ సహాయం తీసుకోవడం, బీడీ వెలిగిస్తూ నరేష్ బొమ్మ చూడటం ఇలా జరిగిపోతుంది. కాకతాళీయంగా అదే సంవత్సరం జనవరి 14నే మంచి దొంగ రిలీజయ్యింది. ఇప్పుడు నా సామిరంగ రిలీజ్ డేట్ కూడా ఇదే. అంటే దర్శకుడు విజయ్ బిన్నీ, రచయిత ప్రసన్న కుమార్ ఈ విషయంలో తగిన రీసర్చ్ చేసి మరీ టైమింగ్ కుదిరేలా ప్లాన్ చేసుకోవడం బాగుంది.
గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినప్పుడు తన గురించి చెప్పుకుంటూ నేను చిరంజీవి స్వయంకృషి టైపని చెప్పడం బాగా పేలింది. ఈ విధంగా రెండు సినిమాల్లో చిరుని వాడుకున్నారు. నాగార్జున, చిరంజీవిల మధ్య అంత బాండింగ్ ఉంది కాబట్టే అదే సంవత్సరం అదే తేదీకి రిలీజైన వెంకటేష్ రక్త తిలకం కాకుండా మంచి దొంగను పెట్టారు. సినిమాలో కీలకమైన మలుపుకి, క్లైమాక్స్ కి దారి తీసేది ఈ ఎపిసోడే. ప్రస్తుతానికి సంక్రాంతి రెండో విజేతగా నా సామిరంగనే నిలుస్తుందని అంచనా ఉంది కానీ ఇంకో వారం రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది.
This post was last modified on %s = human-readable time difference 9:01 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…