Movie News

షోల డిమాండ్ తట్టుకోలేకపోతున్న హనుమయ్య

థియేటర్లలో హనుమాన్ సునామి మాములుగా లేదు. తొలుత చిన్న సినిమాగా వర్ణించబడి ఇప్పుడు ఆఖరికి అదే పెద్ద మూవీగా మారుతున్న క్రమాన్ని చూసి తలలు పండిన డిస్ట్రిబ్యూటర్లే ఆశ్చర్యపోతున్నారు. ఇంత స్పందన ఊహించలేదని, ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా మంచి నెంబర్స్ వస్తాయని ఆశించామే తప్ప ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో ఊపందుకుందని ఒప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో షోల కౌంట్ అనూహ్యంగా పెంచేస్తున్నారు. అయినా సరే డిమాండ్ కు తగ్గ సప్లై లేక ఆన్ లైన్ లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

ఉదాహరణకు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రేపు సోమవారం హనుమాన్ కు 15 షోలు వేస్తే గుంటూరు కారంకి 7 కేటాయించారు. బాలన్స్ వి ఇతర కొత్త రిలీజులు పంచుకుంటున్నాయి. సిటీ కాబట్టి ఇలా ఉందనుకోవడానికి లేదు. కర్నూలు లాంటి జిల్లా కేంద్రంలో తేజకు 27 షోలు పడితే మహేష్ 24 షోలతో సరిపెట్టాల్సి వస్తోంది. నాలుగో రోజు ఉదయం 8 గంటల షోలు వేయడం స్టార్ హీరోలకు సాధారణం. కానీ హనుమాన్ ఆ ట్రెండ్ ని కూడా బ్రేక్ చేసింది. ఓవర్సీస్ లో ఆల్రెడీ 2 మిలియన్ మార్క్ దాటే దిశగా పరుగులు పెడుతూ చివరికి షాకిచ్చే నెంబర్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లు కూడా పెంచుతారని టాక్ ఉంది. ప్రభుత్వం విధించిన గరిష్ట పరిమితికి లోబడే ఇప్పుడున్న ధరలను సవరిస్తారట. మొత్తానికి హనుమాన్ ర్యాంపేజ్ మాములుగా లేదు. ఇప్పటిదాకా రెండు రోజులకు 45 కోట్లకు పైగా గ్రాస్ తో 25 కోట్ల షేర్ సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ కి కేవలం ఇంకో ఆరు కోట్ల దూరంలో మాత్రమే ఉందట. వీకెండ్ లెక్కలు తేలేలోపు ఆ లాంఛనం అయిపోతుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. నార్త్ లో ఫస్ట్ డే రెండు కోట్లు వస్తే రెండో రోజులు నాలుగున్నర దాటేసింది. మెర్రీ క్రిస్మస్ ని పూర్తిగా టేకోవర్ చేసి మరీ అదరగొడుతోంది. 

This post was last modified on January 14, 2024 8:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

15 minutes ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

2 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

3 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

4 hours ago

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

6 hours ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

6 hours ago