సోషల్ మీడియాతో పాటు పబ్లిక్ లో మిక్స్డ్ టాక్ హోరెత్తిపోతున్న వేళ గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, నైజామ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా ఇటీవల జరిగిన పరిణామాల గురించి కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పంచాయితీలు సహజమేనని, ఇక్కడ ప్రత్యేకంగా మిత్రులు శత్రువులు ఎవరూ ఉండరని, పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాన్ని వీలైనంత త్వరగా వెనక్కు రాబట్టుకోవడం కోసం వ్యాపారం చేస్తారు తప్పించి కావాలని ఎవరిని అణిచి వేయడం ఉండదనే అర్థంలో వివరణ ఇచ్చారు.
అర్ధరాత్రి ఒంటి గంట షోల వల్ల కొంత నెగటివ్ టాక్ వచ్చినా తర్వాతి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని, నిన్న సుదర్శన్ థియేటర్ కు రెండో సారి గుంటూరు కారం చూసేందుకు వెళ్ళినప్పుడు ఇదే అర్థమయ్యిందని, బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరని నొక్కి చెప్పారు. అయితే వివాదాస్పద అంశాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడేందుకు దిల్ రాజు ఇష్టపడలేదు. నాగవంశీ ఆదరణ బాగుందని చెబుతూ, ఇంకేదో అడగబోతూ పక్కనున్న దిల్ రాజు చెవిలో గుసగుస లాడటం, ఆయన వద్దని వారించడం కెమెరా దృష్టిలో పడింది. నేనే భయపెట్టానని దిల్ రాజు నవ్వుతు సర్దిచెప్పారు.
అఫీషియల్ గా 94 కోట్లు గ్రాస్ వచ్చిందని గుంటూరు కారం ప్రకటించింది. షేర్ రూపంలో నలభై అయిదు కోట్ల దాకా వస్తుంది. వీకెండ్ తో పాటు వరస సెలవుల వల్ల బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ హడావిడి అంతా నాలుగైదు రోజుల వరకేనని ఆ తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాల పనులు, విశేషాలతో కొనసాగుతుందని దిల్ రాజు చెప్పారు. కలెక్షన్లని బట్టే సినిమా ఏ స్థాయిలో బ్లాక్ బస్టరో అర్థం చేసుకోవచ్చనే హింట్ కూడా ఇచ్చారు. హనుమాన్ తో గట్టి పోటీ ఎదురవుతున్న వేళ గుంటూరు కారంకు బుధవారం దాకా రన్ చాలా కీలకం కానుంది. బలంగా హోల్డ్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉంటుంది.
This post was last modified on January 13, 2024 4:33 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…