ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా చివరి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి జ్ఞాపకం కావాలని కోరుకుంటారు. అది సహజం. ఏఎన్ఆర్ లాంటి లెజెండ్ కోరిమరీ మనం లాంటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని వెళ్లిపోయారు. తాజాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హనుమాన్ లో రాకేష్ మాస్టర్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈయన కొన్ని నెలల క్రితమే కాలం చేశారు. ఒకప్పుడు కొరియోగ్రాఫర్ గా టాప్ స్టార్స్ కి స్టెప్స్ కంపోజ్ చేసి, తర్వాత బ్రేక్ తీసుకుని, రీ ఎంట్రీలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ కి హనుమాన్ లో చెప్పుకోదగ్గ పాత్రే దక్కింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆయన పోకముందే షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఊరిని వేధించే విలన్ తరఫున పన్నులు వసూలు చేస్తూ కామెడీగా నటించే పాత్రలో బాగానే నవ్వులు పూయించారు. రెగ్యులర్ గా కనిపించే గుండు వెనుక ఓ పిలక పెట్టి తేజ సజ్జ చేతిలో తన్నులు తినే పాత్ర స్క్రీన్ మీద పేలింది. చెప్పుకోదగ్గ స్పేస్ దొరికింది. ఒకవేళ బ్రతికి ఉంటే హనుమాన్ సాధించిన సక్సెస్ చూసి ఖచ్చితంగా సంతోషపడే వాళ్ళు. చూసిన ఆడియన్స్ సైతం జీవించి ఉంటే మంచి ఆఫర్లు తలుపు తట్టేవని నిట్టూరుస్తున్నారు. వ్యక్తిగత ప్రవర్తన, కామెంట్లతో రాకేష్ వివాదాల్లో ఇరుక్కునే వారు.
విధి ఎంత విచిత్రమైందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. రికార్డులు సృష్టించే దిశగా పరుగులు పెడుతున్న హనుమాన్ కి క్రమంగా థియేటర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోలు వేగంగా యాడ్ అవుతున్నాయి. నైజామ్ లో గుంటూరు కారంతో పాటు ఇతర మూడు సినిమాలకు చేసిన అగ్రిమెంట్ వల్ల వెంటనే ఇవ్వలేకపోతున్నారు కానీ సోమవారం నుంచి పరిస్థితిలో మార్పు ఉంటుందని నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కి ఒక మంచి నివాళిగా హనుమాన్ మూవీ ఆయన ఫిల్మోగ్రఫీలో చివరి స్థానాన్ని గౌరవంగా అందించింది.
This post was last modified on January 12, 2024 6:12 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…