ఎల్లుండి విడుదల కాబోతున్న నా సామిరంగ ప్రమోషన్లు ఒక కొలిక్కి వచ్చేస్తున్నాయి. నాగార్జున మెల్లగా రిలాక్స్ అవుతున్నారు. అయితే పోటీ వల్ల కేవలం 300 థియేటర్లతో సర్దుకోవాల్సి వచ్చిందని ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించడం ఆశ్చర్యం కలిగించేదే. గతంలో బంగార్రాజుకి కరోనా వల్ల పెద్దగా పోటీ లేకపోవడంతో మంచి రిలీజ్ దక్కి విజయానికి ఉపయోగపడిందని ఈసారి మాత్రం గట్టి కాంపిటీషన్ ని ఫేస్ చేయాల్సి వస్తోందని అన్నారు. ఆల్రెడీ హనుమాన్, గుంటూరు కారం తీర్పులు వచ్చాయి. రేపు ఈ సమయంలోపే వెంకటేష్ మూవీ రిజల్ట్ తెలిసిపోతుంది. మిగిలింది సామిరంగ మాత్రమే.
పోటీదారుల సంగతి ఎలా ఉన్నా నాగార్జున మాత్రం ఖచ్చితంగా హిట్టు కొడతామనే నమ్మకంతో కనిపిస్తున్నారు. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కలగలసిన స్క్రిప్ట్ అని ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లేట్ గా రావడం వల్ల కొంత రిస్క్ ఉన్నప్పటికీ గతంలో జనవరి 14న వచ్చి బ్లాక్ బస్టర్స్ సాధించినవి ఎన్నో ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు స్క్రీన్ల కొరత వల్ల హనుమాన్ కి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కౌంట్ పెంచుకోవడానికి కొన్ని ఇబ్బందులైతే పడటం కనిపిస్తోంది.
నా సామిరంగకు కొన్ని తిప్పలు తప్పవు. కాకపోతే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనక 19 దాకా ఉన్న సెలవులను వాడుకుని వసూళ్లు రాబట్టుకోవచ్చు. అన్నిటి కన్నా పెద్ద సానుకూలాంశం ఈ సినిమా పెట్టుకున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇరవై కోట్ల లోపేనని ట్రేడ్ టాక్. సో హిట్ అయితే చాలు రికవరీ సులభంగా ఉంటుంది. పైగా జనవరి చివరి వారం దాకా చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఏమీ లేవు. టార్గెట్ పెట్టుకున్న మాస్ ని ఆకట్టుకుంటే బిసి సెంటర్లలో పాగా వేయొచ్చు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న నా సామిరంగ ఆశికా రంగనాథ్ హీరోయిన్ కాగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
This post was last modified on January 12, 2024 4:25 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…