Movie News

హనుమాన్ వాడకం మామూలుగా లేదు

మొదలైనప్పుడు చిన్న సినిమాగానే ఉన్న హనుమాన్ రిలీజ్ టైంకి పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. రిలీజ్ తర్వాత దీని రేంజ్ వేరు అనిపిస్తుంది. విడుదలకు ముందు రోజు వేసిన పెయిడ్ ప్రీమియర్స్ కు వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలాగా కనిపిస్తోంది. కంటెంట్ పరంగా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా సినిమా ఉండడంతో.. సంక్రాంతి సీజన్ ను ఈ సినిమా బాగా ఉపయోగించుకునేలా ఉంది.

పిల్లలు ఇష్టపడే, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కావడం దీనికి పెద్ద ప్లస్. ఇక ఈ సినిమాలో అందరు హీరోల అభిమానులను ఆకర్షించే అంశాలు ఉన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్లందరినీ కవర్ చేసేలా ఒక ఎపిసోడ్ పెట్టాడు ఇందులో ప్రశాంత్ వర్మ.

హనుమాన్ మూవీలోని ఒక ఎపిసోడ్లో హనుమంతుడి కృపతో అద్భుత శక్తులు సంపాదించిన హీరో.. వాటిని తన స్నేహితుడి ముందు ప్రదర్శించాలనుకుంటాడు. అందులో భాగంగా ముందుగా ఒక బండ రాయిని ఎత్తుతాడు. బాహుబలిలో ప్రభాస్ ఎప్పుడో ఈ పని చేశాడులే అంటాడు హీరో ఫ్రెండు.

ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కో స్టార్ హీరో రిఫరెన్స్ వాడుతూ చివరికి బాలయ్య దగ్గర వచ్చి ఆగాడు ప్రశాంత్ వర్మ. పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో బాగా ట్రోలింగ్ కు గురైన తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సన్నివేశాన్ని ఇందులో రీ క్రియేట్ చేయడం విశేషం. అలా అని అది ఇంకో ట్రోల్ లాగా అనిపించదు. వినోదానికి బాగానే ఉపయోగపడింది. ఈ ఎపిసోడ్ సినిమాలో బాగానే పేలింది. ఇక సినిమా చివర్లో కనిపించే హనుమంతుడి కళ్ళు చూస్తే చిరంజీవి గుర్తొస్తాడు. ఆ రకంగా టాలీవుడ్లో మేజర్ స్టార్ హీరోలు అందరినీ కవర్ చేసి వాళ్ళ అభిమానులందరినీ అట్రాక్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ.

This post was last modified on January 12, 2024 2:50 pm

Share

Recent Posts

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

17 minutes ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

11 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

12 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

12 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

12 hours ago