నిన్న సాయంత్రం వేసిన హనుమాన్ ప్రీమియర్ల నుంచి మంచి టాక్ వినిపిస్తోంది. ఊహించిన దానికన్నా ప్రశాంత్ వర్మ చక్కని అవుట్ ఫుట్ ఇచ్చాడని ఫీడ్ బ్యాక్ వచ్చింది. చాలా చోట్ల థియేటర్ల నుంచి బయటికి వస్తూ ఆడియన్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం చూస్తే కంటెంట్ కనెక్ట్ అయినట్టు కనిపిస్తోంది. అయితే దీన్ని బట్టే ఫైనల్ స్టేటస్ చెప్పలేం కానీ సినిమా నిరాశ పరచలేదన్నది వాస్తవం. నెటిజెన్లు టీమ్ మీద ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ బడ్జెట్లో క్వాలిటీని ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా చూసే ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ ని గుర్తు చేసుకుని ఫీలైపోతున్నారు.
దాని ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ తన గదికి వెళ్తూ దర్శకుడు ఓం రౌత్ ని కం టు మై రూమ్ అని పిలవడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. క్లాసు పీకడానికే అలా అన్నాడని తెగ మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు డార్లింగ్ అభిమానులు నిజంగానే ఓం రౌత్ ని కం మా గదికి రమ్మని ఆహ్వానం ఇస్తున్నారు. ఆదిపురుష్ కు పెట్టిన బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా ఖర్చు కాని హనుమాన్ కి ఇంత మంచి కంటెంట్ దక్కినప్పుడు రామాయణం లాంటి గొప్ప గాథని తీసే విధానం ఏంటని మరోసారి దుయ్యబడుతున్నారు. దెబ్బకు ఓం రౌత్ ట్విట్టర్ ఎక్స్ ట్రెండింగ్ లో వచ్చేలా ఉన్నాడు.
నిజంగానే ఇది తెలుగు దర్శకుడికి దక్కిన ప్రశంసగా చెప్పుకోవాలి. నాలుగు వందల కోట్లతో నిర్మించిన ఆదిపురుష్ కి బెనిఫిట్ షో నుంచే నెగటివ్ టాక్ మొదలైపోయింది. కానీ హనుమాన్ కి మాత్రం అలా జరగలేదు. పై పెచ్చు పాజిటివ్ పోస్టులతో సోషల్ మీడియా కళకళలాడుతోంది. ఇందులోనూ మైనస్ లున్నప్పటికీ అవి క్షమించే స్థాయిలో ఉన్నాయి. కాకపోతే పోటీలో ఉన్న ఇతర సినిమాలు ఏ స్థాయిలో మెప్పిస్తాయనే దాన్ని బట్టి కమర్షియల్ లెక్కల్లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ ఫైనల్ గా చెప్పాలంటే హనుమాన్ సగటు జనాల దృష్టిలో బాక్సాఫీస్ పరీక్ష పాస్ అయినట్టే కనిపిస్తున్నాడు.
This post was last modified on January 12, 2024 8:16 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…