Movie News

అప్పుడు ట్రోల్ చేయండి – ప్రశాంత్ వర్మ

ఒక చిన్న హీరోతో హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తీసి దిగ్గజాలు బరిలో ఉన్నా సరే సంక్రాంతి పండక్కి తన సినిమాను తీసుకొస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ ప్రీమియర్ షోల బుకింగ్స్ లో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా షోలు అధిక శాతం హౌస్ ఫుల్స్ కావడమే దానికి నిదర్శనం. ఇవాళ రాత్రి రాబోయే పబ్లిక్ టాక్ కోసం టీమ్ మొత్తం ఉద్వేగంతో ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మీడియాతో ముచ్చటించాడు. ఇందులో భాగంగా ఇటీవలే తాను చేసిన అవతార్ కామెంట్స్ గురించి ప్రస్తావించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

హనుమాన్ హిట్ అయితే పెద్ద సినిమాటిక్ యునివర్స్ సృష్టిస్తానని, అవతార్ లాంటిది తీస్తానని ప్రశాంత్ వర్మ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దాన్ని కొందరు నెటిజెన్లు ట్రోల్ చేశారు. అంత రేంజ్ ఉందా అంటూ ఎగతాళి చేసిన వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు హనుమాన్ విజయవంతమైతే ఓ రెండేళ్లు సమయం పట్టినా ఖచ్చితంగా అవతార్ లాంటిది తెలుగులో తీస్తానని, ఒకవేళ చేయకపోతే అప్పుడు నిరభ్యంతరంగా ట్రోలింగ్ చేసుకోమని చెప్పాడు. అంతే కాదు మహాభారతం తీయాలనే లక్ష్యం ఉందని, రాజమౌళి అదే ఆలోచనలో ఉన్నారని తెలిసి డ్రాపయ్యానన్నాడు.

ఇంత భరోసాగా చెబుతున్నాడంటే ప్రశాంత్ వర్మ నమ్మకం గెలవడం అవసరమే అనిపిస్తుంది. అయినా అవతార్ ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు వసూలు చేసినా సినిమానే కావొచ్చు. ఇది నచ్చని వాళ్ళూ ఉన్నారు. మాములు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు అదే ప్రపంచాన్ని ఇంకో కోణంలో సగటు ప్రేక్షకుడిగా అర్థం అయ్యేలా ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తే తప్పేం లేదు. రాజమౌళి రెండు వేల కోట్ల సినిమా ఇస్తాడని బాహుబలికి ముందు ఎవరైనా అనుకున్నారా. కొన్ని అద్భుతాలు అంతే. అనూహ్యంగా జరిగిపోతాయి. ఎదురు చూడాలంతే.

This post was last modified on January 11, 2024 4:45 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

4 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

5 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

5 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 hours ago