నందమూరి బాలకృష్ణ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుల్లో ముందుగా గుర్తొచ్చే పేర్లు కోడి రామకృష్ణ, బి గోపాల్. ఆ తర్వాత ఇప్పటి జనరేషన్ లో ఆ గౌరవం దక్కింది బోయపాటి శీనుకే. ఇప్పటికీ ఈ కాంబినేషన్ లో మూడు ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి. సింహా అంచనాలకు మించి ఆడితే లెజెండ్ చరిత్ర సృష్టించింది. ఇక అఖండ ఏకంగా కరోనా వేవ్ ని తట్టుకుని రికార్డులు కొల్లగొట్టింది. ఈ మూడు సినిమాల్లో బాలయ్యను చూపించినంత పవర్ ఫుల్ గా ఇంకే దర్శకుడు చేయలేకపోయాడనేది వాస్తవం. ఇప్పుడీ కలయిక మరోసారి సాధ్యం కాబోతోందని ఫిలిం నగర్ టాక్.
ఫోర్టీన్ రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బాలయ్య బోయపాటిలతో NBK 110కు అంగీకారం జరిగిందని వినికిడి. అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ప్రచార పనులతో పాటు ఇతర బాధ్యతలు బోలెడు నిర్వహించాల్సి ఉంటుంది. పైగా హిందూపూర్ నియోజకవర్గం ఈసారి మరింత ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే బాబీది వీలైనంత త్వరగా పూర్తి చేసి బ్రేక్ ఇస్తారు. ఎలక్షన్లు పూర్తయిపోయి ఫలితాలు వచ్చే దాకా తీరిక చేసుకోవడం కష్టమే.
ఈ వార్త అభిమానులకు మరింత కిక్ ఇచ్చేదే. ఇక బోయపాటి సంగతికొస్తే వినయ విధేయ రామ చేసిన గాయం అఖండ పూర్తిగా మాన్పేసింది. ఇంకే సమస్య లేదనుకుంటే తిరిగి స్కంద మళ్ళీ రేపింది. చాలా సీన్లు ట్రోలింగ్ కు గురయ్యాయి. బాలయ్యను డీల్ చేయడంలో అద్భుతమైన పనితనం చూపిస్తున్న బోయపాటి శీను ఎందుకనో ఇతర హీరోల విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు భద్ర, తులసి లాంటి బ్లాక్ బస్టర్లు బయట వాళ్ళతో చేసినవే కదా. ఏదైతేనేం మొత్తానికి అభిమానులు కోరుకున్నది మళ్ళీ జరుగుతోంది. ఇది అఖండ 2నా లేక కొత్తగా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on January 10, 2024 10:37 pm
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…