ఒకప్పుడు పెద్ద, చిన్న అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఒకే రేట్లతో చూసేవారు ప్రేక్షకులు. మహా అయితే బెనిఫిట్ షోలకు మాత్రం ఎక్స్ట్రా రేట్లు ఉండేవి. అవి ఏ అర్ధరాత్రో తెల్లవారుజామునో మొదలయ్యేవి కాబట్టి అభిమానులు మాత్రమే వాటికోసం ఎగబడేవారు.
మిగతా ప్రేక్షకులంతా ఉదయం మామూలు రేట్లతోనే సినిమాలు చూసేవారు. కానీ కొన్నేళ్ల కిందటి నుంచి కథ మారిపోయింది. ఆల్రెడీ టికెట్లు ధరలు పెంచి ఉండగా.. వాటి మీద అదనపు రేట్లతో పెద్ద సినిమాల క్రేజ్ ను సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే భారీ బడ్జెట్లో తెరకెక్కి విజువల్ గా ప్రత్యేక అనుభూతిని కలిగించే ఈవెంట్ సినిమాలకు రేట్లు పెంచడాన్ని అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తరహా సినిమాలకు ఎక్కువ రేటు పెట్టడం పెట్టి సినిమా చూడడంలో న్యాయం ఉంది.
కానీ సగటు కమర్షియల్ సినిమాలకు కూడా ఇలాగే రేట్లు పెంచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత నెలలో సలార్ సినిమాకు, ఇప్పుడు గుంటూరు కారం చిత్రానికి అయిన కాడికి రేట్లు పెంచేశారు. సింగిల్ స్క్రీన్లలో 250, మల్టీప్లెక్స్ లో 410 పెట్టి సినిమా చూడాల్సి వస్తోంది. ఇది ప్రేక్షకులకు ఖచ్చితంగా భారమే. ఇవేమీ విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ భారీ చిత్రాలు కావు.
ముఖ్యంగా గుంటూరు కారం అయితే సగటు మాస్ సినిమా. ఇలాంటి సినిమాలకు ప్రొడక్షన్ మీద పెడుతున్న ఖర్చు తక్కువ, పారితోషకాల రూపంలో ఇస్తున్నది ఎక్కువ. బడ్జెట్ మాత్రం 100 కోట్లు దాటిపోతుంది. అందుకు తగ్గట్లే సినిమాను ఎక్కువ రేట్లు అమ్ముతారు. చివరికి భారం అంతా ప్రేక్షకుల మీద వేస్తున్నారు. మరి ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ధరలు పెంచుకునే అవకాశం ఇస్తోందని అర్థం కాని విషయం. ఇది కచ్చితంగా దోపిడీయే అనే అభిప్రాయాన్ని సగటు సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 10, 2024 10:37 pm
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…