ఈ సంక్రాంతికి ఆసక్తికర బాక్స్ ఆఫీస్ క్లాస్ చూడబోతున్నాం. పండుగ బరిలో ఉన్న నాలుగు సినిమాలు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇందులో అన్నిటికన్నా ముందుగా రిలీజ్ అవుతున్న హనుమాన్ చిత్రానికి.. చివర్లో విడుదలయ్యే నా సామి రంగ సినిమా దర్శకుడు పని చేయడం విశేషం. నా సామి రంగ మూవీతో విజయ్ బిన్ని దర్శకుడుగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అతను టాలీవుడ్లో చాలా ఏళ్లుగా కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.
లారెన్స్ తర్వాత నాగార్జున దర్శకుడిగా పరిచయం చేస్తున్న మరొక కొరియోగ్రాఫర్ అతను. విజయ్ వంద సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేయడం విశేషం. చివరగా అతను నృత్య రీతులు సమకూర్చిన సినిమా హనుమానే కావడం విశేషం.
నా సామిరంగ షూటింగ్ మొదలైంది ఆగస్టులో. అంతకంటే ముందే హనుమాన్ మూవీ టాకీతో పాటు పాటల చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఆ సినిమాలో అన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసింది విజయ్ బిన్నీనే కావడం విశేషం. చిత్రాల్లో చాలావరకు మాంటేజ్ సాంగ్సే ఉంటాయని.. వాటిలో క్రియేటివిటీ చూపించడానికి తనకు అవకాశం దొరికిందని.. అదే దర్శకత్వం చేయడానికి ఉపయోగపడిందని విజయ్ బిన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
తాను డైరెక్షన్ చేయాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని.. అయితే బేసిగ్గా తాను డాన్సర్ కావడంతో, సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకోవడానికి కొరియోగ్రఫీ మంచి అవకాశం అని భావించి అందులోకి వెళ్ళినట్లు విజయ్ తెలిపాడు. జెర్సీ సహా అనేక సినిమాల్లో డాన్స్ తో సంబంధం లేకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, క్రియేటివ్ గా తాను పాటలు కొరియోగ్రాఫ్ చేసినట్లు అతను చెప్పాడు. ఈ అనుభవంతోనే నా సామి రంగ చిత్రాన్ని కేవలం 80 రోజుల్లోపు తీసినట్లు తెలిపాడు. ఈ చిత్రం దర్శకుడిగా తనేంటో రుజువు చేస్తుందని అతని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on January 10, 2024 6:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…