పేరుకు ఎల్లుండి విడుదలైనా రేపు సాయంత్రమే భారీ ప్రీమియర్లు ప్లాన్ చేసుకున్న హనుమాన్ బృందానికి ఊహించని స్థాయిలో స్పందన దక్కుతోంది. మొదట కొన్ని సెంటర్లలో షోలు వేయాలనుకున్నా పబ్లిక్ నుంచి అనూహ్యమైన డిమాండ్ రావడంతో ఎక్కడిక్కడ పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కడ చూసినా ఇదే సీన్. రెండు షోలు చాలనుకున్న చోట ఇప్పుడు కనీసం ఆరు దాకా వేస్తున్నారు. నైట్ షోలకు డిమాండ్ పెరుగుతోంది. కరెంట్ బుకింగ్ అవసరం లేకుండానే ఆన్ లైన్లో సోల్డ్ అవుట్స్ పడుతున్నాయి.
అర్ధరాత్రి 1 గంటకు గుంటూరు కారం ఉన్న నేపథ్యంలో అధిక శాతం ప్రేక్షకులు హనుమాన్ ను ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పైగా ఆ తర్వాత వరసగా రెండు రోజులు సైంధవ్, నా సామిరంగలు ఉండటంతో మూవీ లవర్స్ కు అన్ని కవర్ చేయడం పెద్ద సవాలే. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు హనుమాన్ ప్రీమియర్ల నుంచి వచ్చిన గ్రాస్ సుమారు 2 కోట్ల పైనే ఉందట. రేపు షోలు మొదలయ్యే సమయానికి ఇంకా పెరుగుతుంది. సలార్ హడావిడి తగ్గాక బోసిపోతున్న థియేటర్లకు హనుమాన్ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నాడు.
ఇదంతా ఒక వైపు అయితే అసలైన ఛాలెంజ్ టాక్ తెచ్చుకోవడం. ఏ మాత్రం బాగుందనే మాట వినిపించినా చాలు సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. పైగా హనుమంతుడి సెంటిమెంట్ కావడంతో ఇంకా వేగంగా వెళ్తుంది. ఎల్లుండి గుంటూరు కారం తాకిడిని తట్టుకోవడం హనుమాన్ కి అంత సులభంగా ఉండదు. హనుమాన్ కి ప్రీమియర్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా ఆది కలెక్షన్లు మారడానికి, షోలు పెంచుకోవడానికి ఒకటి రెండు రోజులు టైం పడుతుంది. ఏ రకంగా చూసిన భారీ ఎత్తున వేసిన స్పెషల్ షోల ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతోంది. అంచనాలు నిలబెట్టుకోవడమే మిగిలింది.
This post was last modified on January 10, 2024 4:52 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…