తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ సినిమాల్లో హిట్ ఒకటి. కొత్త దర్శకుడు శైలేష్ కొలను.. విశ్వక్సేన్ హీరోగా తీసిన హిట్ మంచి సక్సెస్ అయ్యి ఈ ఫ్రాంచైజీకి ఊపు తెచ్చింది. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా హిట్-2 తీసి ఇంకా పెద్ద సక్సెస్ అందుకున్నాడు శైలేష్. ఈ సినిమా చివర్లో హిట్-3కి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో హిట్ సిరీస్ నిర్మాత నానినే హీరోగా నటించబోతున్న సంగతీ విదితమే.
అయితే హిట్-2 రిలీజ్ అయి ఏడాది దాటినా ఇంకా ఆ సినిమా గురించి ఏ ఊసూ లేదు. హిట్ -2 తర్వాత శైలేష్ కొలను సైంధవ్ సినిమా తీశాడు. నాని వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి హిట్ -3 నిజంగా ఉంటుందా.. ఉంటే ఎప్పుడూ అనే విషయాలపై క్లారిటీ లేదు. సైంధవ్ ప్రమోషన్లలో భాగంగా శైలేష్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. హిట్-3 ఏడాదిన్నర తర్వాత మొదలవుతుందని శైలేష్ చెప్పాడు.
ఆ సినిమా ఐడియా వరకు ఓకే అయిందని, పూర్తి స్క్రిప్ట్ రెడీ కావాల్సి ఉందని.. నాని కూడా అందుబాటులోకి వచ్చి సినిమా మొదలవడానికి చాలా టైం పడుతుందని శైలేష్ తెలిపాడు. ఇక సైంధవ్ తర్వాత తన కొత్త చిత్రం గురించి మాట్లాడుతూ.. సైంధవ్ సక్సెస్ అయితే చంద్రప్రస్థ వరల్డ్ ను కొనసాగిస్తూ ఇంకో సినిమా చెయ్యాలని అనుకుంటున్నానని.. అలాగే తన జీవితంలోని వాస్తవ ఘటనల ఆధారంగా ఒక మంచి ప్రేమ కథను రాశానని, దానిమీద కూడా ఓ సినిమా తీయాల్సి ఉందని శైలేష్ తెలిపాడు.
సైంధవ్ రిజల్ట్ ను బట్టి తన కొత్త చిత్రం ఖరారు అవుతుందని అతను చెప్పాడు. వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన సైంధవ్ ఈ నెల 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 10, 2024 2:56 pm
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…
గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…
భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…
ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…