మంగళవారం రాత్రి గుంటూరు సిటీలో జరిగిన గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఈవెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, గొడవలు మాత్రమే కారణం కాదు. ఈ వేడుకలో ఇద్దరు ముఖ్య వ్యక్తులు చాలా ఎమోషనల్ గా కనిపించారు. చాలా ఉద్వేగంగానూ మాట్లాడారు. ఆ ఇద్దరే హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
మహేష్ బాబు ఎన్నడూ లేనంత ఎమోషనల్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఆయన ఎంతో ఇష్టపడే తల్లిదండ్రులు కృష్ణ, ఇందిర ఏడాది వ్యవధిలో కన్నుమూశారు. అదే సమయంలో తన సోదరుడు రమేష్ బాబుని కూడా ఆయన కోల్పోయారు. ఈ ముగ్గురు దూరమయ్యాక జరుగుతున్న తొలి మహేష్ సినిమా వేడుక గుంటూరు కారందే. అందుకే మహేష్ బాబు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ ఇకపై అభిమానులే తన అమ్మ నాన్న అనేశాడు. అయితే ఇదే వేడుకలో త్రివిక్రమ్ సైతం ఎమోషనల్ అయి, కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయా సినిమాలకు సంబంధించి ముఖ్య వ్యక్తుల ఏవీలు ప్రదర్శించడం మామూలే. ఇందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించి ఏవీని ప్రదర్శించారు. అయితే అది చూస్తూ.. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం అని తన జర్నీ అంతా గుర్తు చేసుకున్నాడో ఏమో.. ఎన్నడూ లేని విధంగా త్రివిక్రమ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మరీ ఏడ్చేయడం లాంటిది ఏమీ చెయ్యలేదు కానీ.. ఆయన కళ్ళలోని తడి మాత్రం కెమెరాలకు కనిపించింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా త్రివిక్రమ్ కొంచెం ఎమోషనల్ గానే కనిపించాడు. హీరో మహేష్ బాబును ప్రశంసల్లో ముంచెత్తుతూ సాగిన ఆయన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.
This post was last modified on January 10, 2024 10:28 am
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…