టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్న శ్రీలీలకు ఎల్లుండి పెద్ద పరీక్షే ఎదురుకానుంది. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడి కట్టిన గుంటూరు కారం భారీ అంచనాలతో విడుదలవుతోంది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా దీని మీద విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా సూపర్ స్టారే స్టేజి మీద వేలాది మంది చూస్తుండగా, కోట్లాది మంది టీవీ, ఆన్ లైన్ లో వీక్షిస్తుండగా శ్రీలీలతో డాన్స్ చేస్తే హీరోలకు తాట ఊడిపోతుందని చెప్పడం కన్నా గొప్ప కితాబు ఇంకేముంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మాములుగా మహేష్ తన ఈవెంట్లలో హీరోయిన్లను మెచ్చుకోవడం సహజమే కానీ మరీ ఇంత ఎలివేషన్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఊర మాస్ గా తను డాన్స్ చేసి ఎంత కాలమయ్యిందో. ఎప్పుడో పోకిరి తర్వాత మళ్ళీ అంత ఎనర్జీని వాడుకున్న దర్శకుడు లేడు. గుంటూరు కారం అలాంటి కథ కావడం, కమర్షియల్ అంశాలను పుష్కలంగా దట్టించి మాస్ తో విజిల్స్ వేయించే పాటలు పెట్టడం వగైరా కారణాలతో పాటు తన సినిమాల్లో సందేశాలు ఎక్కువయ్యాయని ఫీలవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు పూర్తిగా మేకోవర్ కావడం అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇది బ్లాక్ బస్టర్ కావడం శ్రీలీలకు చాలా కీలకం. భగవంత్ కేసరిని మినహాయిస్తే తనకు మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ మూడు ఒకదాన్ని మించి మరొకటి దెబ్బేశాయి. అందులో ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా పాటలకు పరిమితం చేశారు. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మెయిన్ హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంటుంది. కారం తింటున్న వాళ్లకు తీపి పంచుతానని చెబుతున్న శ్రీలీల ఇందులో బెస్ట్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చిందనే టాక్ యూనిట్ లో ఉంది. ఇది కనక ఘనవిజయం అందుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 10, 2024 10:10 am
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఉన్న గ్యాప్ను దాదాపు తగ్గించుకునే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ…
ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్లో నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్స్టాస్ మధ్య…