టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ చూసుకున్నా అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కల్కి ఏడి 2898 విడుదల తేదీని లాక్ చేసుకున్నట్టు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ మే 9న మొదటి భాగాన్ని ప్రపంచానికి చూపించాలని డిసైడయ్యారట. ఈ డేట్ వెనుక వైజయంతి మూవీస్ కి ఒక సెంటిమెంట్ ఉంది. 1990 ఇదే రోజు జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక ల్యాండ్ మార్క్ మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని తుఫాను ముంచెత్తిన సమయంలో రికార్డుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ కొట్టింది.
చిరంజీవి కెరీర్ బెస్ట్ టాప్ 5లో దీని స్థానం చాలా ప్రత్యేకం. మళ్ళీ 2018లో మహానటి మే 9న వచ్చి గొప్ప విజయాన్ని అందుకుంది. స్టార్ హీరో లేకుండా విషాదమైన సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ ని చూపించిన తీరు కమర్షియల్ గానూ అద్భుతాలు సాధించి ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది. దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభ గొప్పదనం తెలిసింది ఆ రోజే. ఇలా తమ బ్యానర్ కు మెమరబుల్ డేట్ గా మారిపోయిన మే 9కే కల్కిని రిలీజ్ చేయాలని దాదాపు ఖరారు చేసుకున్నట్టు సమాచారం. అఫీషియల్ గా సంక్రాంతి పండక్కు ప్రకటించే ఛాన్స్ ఉంది. అప్పటిదాకా ఇది అనధికార వార్తే.
ఇదే జరిగితే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన కేవలం అయిదు నెలల లోపే ఇంకో ప్రభాస్ సినిమా చూసే ఛాన్స్ అభిమానులకు దక్కుతుంది. కల్కిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేస్తున్న నాగ అశ్విన్ బృందం ఫిబ్రవరి నుంచి దీన్ని ఇంకో రేంజ్ కి తీసుకెళ్ళబోతున్నారు. సినిమాలో భాగమైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులతో భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారు. మరి మే 9న కల్కి వస్తాడో రాదో ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. చూద్దాం
This post was last modified on January 9, 2024 10:11 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…