షూటింగ్స్ కోసం ఎండనక, వాననకా పగలురాత్రి కష్టపడే మన స్టార్లు… సమ్మర్ వచ్చిందంటే చాలు, విదేశాలకు వెళ్లి కూల్ అవుతూ ఉంటారు. ఏసీ కార్లు, లగ్జరీ బంగ్లాల్లో గడిపే స్టార్లు… ఇక్కడ ఎండలను తట్టుకోలేక ఏప్రిల్, మే నెలల్లో యూరోపియన్ దేశాల్లో వాలిపోయేవారు.
అయితే ఈ ఏడాది షూటింగ్స్‌కి ప్యాకప్ చెప్పిన కరోనా వైరస్, స్టార్ల ఫారిన్ టూర్లకు కూడా బ్రేక్ పడేలా చేసిందిట. ప్రతీ ఏడాదిలాగే ఈ సమ్మర్‌లో కూడా ఫారిన్ లొకేషన్స్‌కి వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని పక్కా ప్లాన్స్ వేసుకున్న చాలామంది స్టార్లు, కాని లాక్ డౌన్ దెబ్బకి అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.
మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్, ప్రభాస్, సమంత- నాగచైతన్య జంట… ఇలా చాలామంది స్టార్లు సమ్మర్‌లో యూరోపియన్ కంట్రీస్ వెళ్లి ఫుల్లుగా రిలాక్స్ అవుతుంటారు. సినిమా షూటింగ్ ఉన్నా ఇక్కడ మండే ఎండల్లో షూటింగ్ చేయడం కష్టమనే వంకతో ఫారిన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునేవారు.
ఓ రేంజ్ స్టార్ డమ్ సంపాదించిన హీరోల దగ్గర్నుంచి, ఓ మోస్తరు అవకాశాలతో నెట్టుకొచ్చే హీరోయిన్లదాకా చాలామంది ఇలా సమ్మర్‌లో ఫారిన్ కంట్రీస్‌లో వాలిపోయేవారు. ముఖ్యంగా అందాన్ని కాపాడుకునేందుకు తెగ ఆరాటపడే హీరోయిన్లు, ఇక్కడ వేడి వాతావరణాన్ని అస్సలు తట్టుకోలేమని వేసవిలో ముఖం చాటేసేవారు. ఇక్కడ ఎండలు తగ్గిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చేవారు. కొంతమంది హీరోలు సమ్మర్లో ఫారిన్ షూటింగ్ పెట్టుకునేవారు.
కానీ కరోనా కారణంగా వీళ్లంతా హైదరాబాద్‌లోనే ఉండాల్సి వచ్చింది. షూటింగ్స్ కూడా లేకపోవడంతో లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. దానితో చాలామందికి ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతోందట. హైదరాబాదులో ఇంత వేడిగా ఉందా నాయనో అంటూ షాకవుతున్నారట.
ఎంత తమ ఇళ్ళలో సెంట్రలైజ్డ్ ఏ/సి ఉన్నా కూడా.. సరదాగా ఓ మారు బాల్కనీలోకి వచ్చినా, స్విమ్మింగ్ పూల్ లోకి దూకుదామన్నా.. సూర్యుడి తాపం వీరికి చెమట్లు పట్టిస్తోందట. మరి సమ్మర్లో ఇంతకంటే వేడిని తట్టుకుని క్యూలో నుంచొని టిక్కెట్లు కొని సినిమా చూసే వీళ్ల ఫ్యాన్స్ ఏమని చెప్పుకోవాలో!!
This post was last modified on April 26, 2020 2:34 pm
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…