ఇటీవలే జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజుని సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజుల గురించి ఒక మీడియా ప్రతినిధి అడిగితే వాటి గురించి మనకెందుకని ఆయనిచ్చిన సమాధానం యూట్యూబ్ లో ఎప్పటికీ ఉంటుంది. కట్ చేస్తే అయలాన్ ఉత్తరాంధ్ర, నైజామ్ హక్కులను దిల్ రాజు కొనడంతో పాటు మిగిలిన ఏరియాలకు ఎన్వి ప్రసాద్, సురేష్ డిస్ట్రిబ్యూటర్స్, వి మూవీస్, అనుశ్రీ ఫిలింస్, ఉషా పిక్చర్స్ ఒప్పందాలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే జనవరి 12నే గుంటూరు కారం, హనుమాన్ లతో పాటు ఆయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తారనే డౌట్ వస్తోంది.
దీని సంగతలా ఉంచితే ప్రాధాన్యత క్రమంలో హనుమాన్ చివరి స్థానంలో ఉంటుందని ఈగల్ వాయిదా ప్రకటన ప్రెస్ మీట్ లో చెప్పిన దిల్ రాజుకి కౌంటర్ గా నిన్న చిరంజీవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో శతమానం భవతిని ఎందుకు రిలీజ్ చేస్తున్నారని మెగాస్టార్ అడిగితే కంటెంట్ బాగుంది కాబట్టి ఢోకా లేదని రాజుగారు చెప్పిన సమాధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటప్పుడు హనుమాన్ లోనూ మంచి కంటెంట్ ఉందని తెలిసినప్పుడు దాన్ని తప్పుకోమని ఒత్తిడి చేయడమెందుకనే లాజిక్ బయటికి వస్తోంది.
గత ఏడాది సంక్రాంతికి వారసుడు టైంలో ఇలాంటి ఇష్యూనే వచ్చినప్పుడు ఇది వ్యాపారం, ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చని చెప్పిన దిల్ రాజే మరి గుంటూరు కారంకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి హనుమాన్ కి తక్కువ సింగల్ స్క్రీన్లు వచ్చేలా చేయడం వెనుక మతలబేంటో వివరించాలని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. తేజ సజ్జకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దగా లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే రచ్చ, చర్చ ఇంకో స్థాయిలో జరిగేదేమో. ఈ లాజిక్కులు, ప్రశ్నలు దిల్ రాజుకి తెలియనివి కావు. కానీ శతమానం భవతికి వర్తించే సూత్రం హనుమాన్ కు ఎందుకు అన్వయించకూడదనే క్వశ్చన్ కి సమాధానం దొరికితే చాలు.
This post was last modified on January 8, 2024 7:43 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…