Movie News

5 రూపాయల విరాళం వెనుక దూర దృష్టి

నిన్న జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్ మీద 5 రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళం ఇస్తామని టీమ్ ప్రకటించింది. తాము చెబితే అంత రీచ్ కాదని భావించి ఏకంగా గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో ప్రకటన ఇప్పించారు. దీంతో ఇది సహజంగానే నేషనల్ మీడియాలో ఎక్కువ కవరేజ్ కి నోచుకుంది. జనవరి 22 ప్రారంభం కాబోతున్న రాముడి గుడికి ఇప్పటికిప్పుడు చందాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా దూర దృష్టితో ప్రశాంత్ వర్మ బృందం చేసిన ఆలోచన వెనుక పలు లాభాలు, ఇబ్బందులు రెండూ కనిపిస్తున్నాయి.

రాముడి సెంటిమెంట్ దేశమంతా వీస్తున్న టైంలో ఇలా టికెట్ మీద అయిదు రూపాయలు రాముడికి వెళ్తుందనే మాట భక్తి పరంగా ప్రేక్షకుల మనసుల్లోకి బలంగా వెళ్తుంది. ఆ డబ్బులు ముట్టడం కోసం టికెట్ కొంటారని కాదు కానీ, ఎలాగూ దైవబలం గురించి చెప్పే సినిమా కాబట్టి చూస్తే పోలా అనుకునే ఆడియన్స్ లక్షల నుంచి కోట్లకు చేరుకోవచ్చు. ఇబ్బంది విషయానికి వస్తే ఆదిపురుష్ టైంలో ఒక సీటు హనుమంతుడికి ఖాళీ ఉంచాలని ఊదరగొట్టిన టి సిరీస్ బ్యాచ్ తర్వాత టాక్ వచ్చాక హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. అది పాటించారో లేదో కూడా తెలియనంతగా పట్టించుకోకుండా వదిలేశారు.

ఇప్పుడు హనుమాన్ కి అలా చేయకూడదు. రోజువారీ గ్రాస్ ని చూసుకుంటూ, ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో ఎప్పటికప్పుడు దాన్ని సమాచార రూపంలో మీడియాకు ప్రేక్షకులకు తెలియజేయడం ద్వారా, ఫైనల్ గా ఎంత మొత్తం అయోధ్యకు వెళ్తుందో క్లారిటీ ఇవ్వడం ద్వారా కామెంట్స్ రాకుండా చూసుకోవచ్చు. గుంటూరు కారంతో క్లాష్ వల్ల ఏపీ, తెలంగాణలో థియేటర్ల కొరత ఎదురుకుంటున్న హనుమాన్ భారమంతా ఉత్తరాది రాష్ట్రాల మీద ఉంది. ఎలాగూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజ్ లేకపోవడం చాలా ప్లస్ కానుంది. ఒక్క మెర్రి క్రిస్మస్ మాత్రమే రేస్ లో ఉండటం హనుమాన్ కి కలిసొచ్చే పెద్ద అంశం.

This post was last modified on January 8, 2024 12:16 pm

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

9 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago