థియేటర్ల సమస్యతో పాటు పోటీని నివారించాలనే ఉద్దేశంతో సంక్రాంతి బరి నుంచి రవితేజ ఈగల్ తప్పుకోవడం గురించి చర్చ జరిగిపోయి ఇప్పుడందరి దృష్టి కొత్త రిలీజుల మీద పడింది. ఇంత టైట్ గా ఉంది కాబట్టి డబ్బింగ్ సినిమాలకు చోటు లేదనే దిశగా ఫిలిం ఛాంబర్ సంకేతాలు ఇచ్చింది కానీ తాజాగా ఆయలాన్ కి అభయ హస్తం దొరికినట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత దిల్ రాజు ఉత్తరాంధ్ర, నైజామ్ ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు కొన్నట్టు లేటెస్ట్ అప్డేట్. అగ్రిమెంట్ కుదిరిందని, స్క్రీన్ల సర్దుబాటు గురించి ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావొచ్చని టాక్.
హనుమాన్ వదిలేసి, కొన్ని ప్రాంతాలకు సైంధవ్ ని పంపిణి చేస్తున్న సురేష్ బాబుని మినహాయిస్తే పండగ డిస్ట్రిబ్యూషన్ మొత్తం దాదాపు దిల్ రాజు చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆయలాన్ కు ఆయన అందదండ అందించినా మరీ ఎక్కువ కాకపోయినా వీలైనన్ని డీసెంట్ స్క్రీన్లు దక్కేలా పావులు కదపగలరు. ఎలాగూ ఈగల్ తప్పుకుంది. దానికి బ్లాక్ చేసి ఉంచిన మూడు వందలకు పైగా థియేటర్లు ఇంకా మిగిలినవాటికి పంచలేదు. సో వాటిని ఇచ్చే క్రమంలో మధ్యలో ఆయలాన్ ని దూర్చడం పెద్ద విషయం కాదు. డబ్బింగ్ వెర్షన్ విషయంలో శివ కార్తికేయన్ పట్టుదలగా ఉన్నాట్ట.
అఫీషియల్ గా వచ్చే దాకా దీని తాలూకు పరిణామం ఎలా ఉండబోతోందనేది చెప్పలేం. ఆ మధ్య దిల్ రాజే మనకే చొక్కాలు చించుకుంటున్నప్పుడు డబ్బింగ్ సినిమాల గురించి ఎందుకు అడుగుతారని మీడియాని రివర్స్ లో అడిగారు. ఇప్పుడు ఆయలాన్ ఆయనే కొని మరీ రిలీజ్ చేస్తే అనూహ్యమే. గత ఏడాది వారసుడు టైంలోనూ ఇదే విషయంగా ఇబ్బందులు ఎదురుకుని మూడు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేసిన సంగతి గుర్తే. అయినా సరే ప్రీమియమ్ స్క్రీన్లు దానికి పడ్డాయి. ఇప్పుడు అయలాన్ కి అదే స్ట్రాటజీ ఫాలో అవుతారా లేక జనవరి 12కే దింపుతారా వెయిట్ అండ్ సి.
This post was last modified on January 7, 2024 7:00 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…