సంక్రాంతి రేసులో చివరిగా జనవరి 14 విడుదల కాబోతున్న నా సామిరంగ మీద మెల్లగా హైప్ పెరుగుతోంది. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నాగార్జున సినిమా చేసి చాలా కాలం కావడంతో అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. పైగా తమ హీరో ఇంత కసితో వేగంగా పూర్తి చేయడం వెనుక నమ్మకానికి ముచ్చటపడిపోయి బ్లాక్ బస్టరని ఫిక్స్ అయిపోయారు. పోటీ ఎంత ఉన్నప్పటికీ గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయనలు కాంపిటీషన్ లోనే విజేతగా నిలిచాయి కానీ ఈసారి కూడా ఫలితం రిపీట్ అవుతుందన్న ధీమా ఫ్యాన్స్ లో బలంగా కనిపిస్తోంది. టీమ్ కూడా అలాగే ఉంది.
ఇది మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేకన్న విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ ని యథాతధంగా తీయలేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఒరిజినల్ వెర్షన్ లో లేని కమర్షియల్ అంశాలు మన ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మార్చాడు. ముఖ్యంగా అక్కడి క్లైమాక్స్ లో హ్యాపీ ఎండింగ్ ఉండదు. అలా చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోయే ప్రమాదం ఉంది. గతంలో స్నేహమంటే ఇదేరా విషయంలో నాగార్జునకి ఇది అనుభవమే. అందుకే అలాంటి పొరపాటు జరగకుండా దర్శకుడు విజయ్ బిన్నీతో సాఫీ ముగింపుని ప్లాన్ చేశారట.
సో ఈ మార్పు ఏ మేరకు పేలిందనేది తెరమీద చూడాలి. హీరోయిన్ ఆశికా రంగనాథ్ పాత్ర ఏదో మాములుగా పాటలు, లవ్ ట్రాక్ కోసం ఉండదు. అసలు మలుపులన్నీ ఆమె చుట్టే తిరుగుతాయి. ఈ విషయంలోనూ విజయ్ బిన్నీ తీసుకున్న జాగ్రత్తలు స్క్రీన్ మీద బాగా వచ్చాయని టాక్. రేపు సెన్సార్ ఫార్మాలిటీ పూర్తి చేసుకోబోతున్న నా సామిరంగకు ఇంకో రెండు రోజుల్లో ప్రమోషన్ స్పీడ్ పెంచబోతున్నారు. ముఖ్యంగా మాస్ ని లక్ష్యంగా చేసుకుని ఓపెనింగ్స్ భారీగా వచ్చేలా స్కెచ్ వేస్తున్నారు. మొదటి ఆట పడేలోపే మిగిలిన మూడు సినిమాల జాతకం తెలిసిపోవడం నాగ్ కు కలిసి వస్తుంది.
This post was last modified on January 7, 2024 4:23 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…