ఇవాళ సాయంత్రం హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో చేసే ఛాన్స్ లేదని తేలిపోవడంతో టైటిల్ సెంటిమెంట్ ని ఫాలో అయిపోయి గుంటూరులో చేస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ రోజు దీనికి సంబంధించిన వివరాలు నిర్మాత నాగవంశీ ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో ఏకంగా ప్రీమియర్ ఆడిస్తున్న రేంజ్ లో హంగామా చేసేందుకు డీజేలు, టపాసులతో అభిమానులు సిద్ధమయ్యారు.
ఆన్ లైన్ లోనూ ట్రైలర్ వస్తుంది కానీ సుదర్శన్ కు దానికి మధ్య కనీసం గంట గ్యాప్ ఉండొచ్చని తెలిసింది. అంచనాలకు సంబంధించి గుంటూరు కారం పోటీదారుల కంటే ముందంజలో ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పాటలు తప్ప సరైన వీడియో కంటెంట్ ఏదీ బయటికి రాలేదు. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరిని మాత్రమే రివీల్ చేశారు తప్పించి అసలైన క్యాస్టింగ్ ఇంకా చాలా ఉంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, జగపతిబాబు తదితరులంతా ట్రైలర్ లోనే దర్శనమివ్వబోతున్నారు. వీళ్ళ పాత్రలు ఎలా ఉంటాయో మొదటిసారి రివీల్ అయ్యేది ఇందులోనే. అందుకే ఇంత హైప్.
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు టికెట్ రేట్లకు సంబంధించిన జిఓ ఇచ్చేస్తే వెంటనే బుక్ మై షో అమ్మకాలు మొదలైపోతాయి. ఇవాళ ట్రైలర్ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాకపోవచ్చు కానీ టీమ్ కు సంబంధించిన ముఖ్యమైన ఆరిస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. తమన్ హాజరు కావడం అనుమానమే. ట్రైలర్ లో మహేష్ బాబు ఊర మాస్, మాటల మాంత్రికుడి ట్రేడ్ మార్కు డైలాగులతో పాటు పీక్స్ హీరోయిజం ఉంటుందట. బాహుబలి రికార్డులకు దగ్గరగా వెళ్తామన్న నిర్మాత మాటకు మొదటి పునాది ఇక్కడే పడాలి మరి. చూద్దాం.
This post was last modified on January 7, 2024 12:28 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…