బాలీవుడ్ ప్రముఖ రైటర్ జావేద్ అక్తర్ గురించి తెలియని వారు ఉండరు. షోలే లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తో మొదలుపెట్టి ఈయన ఖాతాలో ఎన్నో మరపురాని క్లాసిక్స్ ఉన్నాయి. గీత రచయితగానూ అపారమైన విద్వత్తు ప్రదర్శించిన జ్ఞానిగా అభిమానులు ప్రేమతో జావేద్ సాబ్ అని పిలుచుకుంటారు. ఇటీవలే ఈయన యానిమల్ కంటెంట్ మీద ఘాటు విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలు ఆదరించడం వల్ల ఇప్పుడు బ్లాక్ బస్టర్లుగా కనిపించినా భవిష్యత్తు తరహాల మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని, రణ్ విజయ్-జోయాల మధ్య బంధాన్ని చూపించిన వైనాన్ని తీవ్రంగా ఎండగట్టారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పెద్ద చర్చకే దారి తీసింది. దీని గురించి స్వయంగా యానిమల్ బృందమే స్పందించింది. మీ స్థాయి రచయిత ప్రేమను అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది కాదని, ఒకవేళ ఇదే కోణానికి కట్టుబడితే మీ కళనే అనుమానించాల్సి వస్తుందని ఘాటుగా కౌంట్ ఇచ్చింది. ఒకవేళ విజయ్ ని కనక జోయా తన బూట్లు శుభ్రం చేయమని అడిగి ఉంటే ఫెమినిజం పేరుతో మీరు సెలెబ్రేట్ చేసుకునేవారని మండిపడింది. వాళ్ళను కేవలం ప్రేమికులుగా చూడండి, ఒక ఉద్దేశంతో ప్రియుడి చేతిలో మోసపోయిందని గుర్తించండంటూ చెప్పుకొచ్చింది.
ఇక్కడ ఎవరి వాదనలో నిజమెంతో పక్కనపెడితే జావేద్ అక్తర్ కు మాత్రం ఇది ఊహించని పంచే. ఇలా స్పందించడం వెనుక దర్శకుడు సందీప్ వంగా ఉన్నాడని వేరే చెప్పనక్కర్లేదు. నిన్న ముంబైలో మరో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్న యానిమల్ టీమ్ ముందు నుంచి ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తన మీద వస్తున్న విమర్శలను తిప్పి కొడుతూనే ఉంది. సందీప్ వంగా సైతం ఇంటర్వ్యూలలో అవకాశం దొరికినప్పుడంతా కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. అయినా ఆడియన్స్ బ్రహ్మాండంగా ఆదరించాక ఏ సినిమాకైనా కొలమానాలు, చర్చలు అనవసరం. ఆమోదించారంటే అంగీకరించినట్టే.
This post was last modified on January 7, 2024 12:24 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…