Movie News

నారా రోహిత్.. సుందరకాండ

ఒకప్పుడు టాలీవుడ్లో చాలా బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. ఒక సమయంలో అతను నటించిన తొమ్మిది సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఏడాదికి మూడు చొప్పున సినిమాలు రిలీజ్ చేసేవాడు రోహిత్. కమర్షియల్ సక్సెస్ అయ్యాయా లేదా అన్నది పక్కన పెడితే.. రోహిత్ సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి అనే పేరు అయితే వచ్చింది.

రౌడీ ఫెలో సహా కొన్ని సినిమాలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ ఎలాంటి హీరోకైనా వరుసగా ఫ్లాపులు వస్తే తట్టుకోవడం కష్టమే. రోహిత్ కూడా అలాగే ఇబ్బంది పడ్డాడు. అనూహ్యంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. నాలుగేళ్ల నుంచి ఏ సినిమా చేయట్లేదు. అందరూ అతణ్ని మరిచిపోతున్న సమయంలో గత ఏడాది ‘ప్రతినిధి-2’ సినిమాను అనౌన్స్ చేశాడు. టీవీ5 న్యూస్ ప్రెజెంటర్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం పెద్ద సర్ప్రైజ్.

ప్రతినిధి- 2 సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటో కానీ.. ఇంతలో నారా రోహిత్ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. కొత్త దర్శకుడు నిర్మాత తో మొదలైన ఈ సినిమాకు సుందరకాండ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. రోహిత్ కెరీర్లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

సందీప్ పిక్చర్స్ ప్యాలెస్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలావరకు కొత్త వాళ్లే నటిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో నారా రోహిత్ ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రోహిత్ కొత్త చిత్రం ప్రతినిధి-2 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట విడుదల అయ్యే అవకాశం ఉంది.

This post was last modified on January 7, 2024 11:13 am

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

1 hour ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

2 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

3 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

5 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

7 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

8 hours ago