ఆర్ఆర్ఆర్ తర్వాత ఆలస్యం చేయకుండా గేమ్‌ఛేంజర్ సినిమాను మొదలుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దాని తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా కాలం అయింది.
ఆ తర్వాత ఏ అప్‌డేట్ లేదు. ఈ ప్రాజెక్టుకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడని చాన్నాళ్ల ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమాచారమే నిజమని తేలింది. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది చరణ్ అభిమానులకు ఎంతో ఎక్సైట్మెంట్ ఇచ్చే విషయమే. అదే సమయంలో ఒక నెగటివ్ సెంటిమెంట్ కూడా వారిని భయపెడుతోంది.
రోజా మొదలుకుని అనువాద చిత్రాలతో ఎన్నో మరపురాని ఆల్బమ్స్ ఇచ్చాడు తెలుగులో రెహమాన్. కానీ ఆయన నేరుగా తెలుగులో చేసిన ఏ చిత్రం కూడా విజయవంతం కాలేదు. సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న కాలంలో చేసిన సూపర్ పోలీస్ మొదలుకొని.. నాని, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో.. ఇలా ప్రతి సినిమా డిజాస్టరే అయింది.
ఒక్క ఏ మాయ చేసావే పరవాలేదు అనిపించింది. దీంతో రెహమాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా అంటే భయపడే పరిస్థితి నెలకొంది. మధ్యలో ఆయనకు సైరా లాంటి భారీ ప్రాజెక్టులో ఆకాశం వచ్చింది కానీ ఆయన తర్వాత దాన్ని వదులుకున్నారు.
ఇప్పుడు చరణ్ సినిమాను ఓకే చేశారు. దీనికి రెహమాన్ మార్కు మెగా ఆల్బమ్ ఇస్తాడని, సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని.. రెహమాన్ తెలుగు సినిమాల విషయంలో ఉన్న నెగటివ్ సెంటిమెంట్ బద్దలు అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని.. చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని.. చరణ్ ఇందులో స్పోర్ట్స్ మన్ టర్న్డ్ కోచ్‌గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on January 7, 2024 11:09 am
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…