Movie News

అరాచకం ఒకవైపు అయోమయం ఇంకో వైపు

ఓవర్సీస్ లో గుంటూరు కారం రికార్డుల వేట మొదలైపోయింది. అయిదు వేలకు పైగా ప్రీమియర్ షోలతో అర మిలియన్ మార్కుకి అతి దగ్గరగా ఉన్న మహేష్ బాబు ఆ లాంఛనాన్ని ఇంకొన్ని గంటల్లో పూర్తి చేస్తాడు. ఇంకా రిలీజ్ కు ఆరు రోజుల సమయం ఉంది కాబట్టి మార్కు ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. జనవరి 12 హైదరాబాద్ తో సహా నైజామ్ లో భారీ రిలీజ్ కు ప్లాన్ చేయడంతో మొదటి రోజే 90 సింగల్ స్క్రీన్లలో అరాచకం సృష్టించబోతున్నాడు. సలార్ టైంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా బుక్ మై షో ఈసారి ముందస్తు జాగ్రత్తగా సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకుని మరీ సిద్ధంగా ఉందని సమాచారం.

ఇలా విధ్వంసం ఒకవైపు కొనసాగుతుండగా ఇంకోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు అయోమయం తీరడం లేదు. అనుమతులు వచ్చి ఉంటే ఇవాళ సాయంత్రమే యూసఫ్ గూడలో వేడుక జరిగేది. కానీ సెక్యూరిటీ కారణాల దృష్ట్యా పోలీసులు ఇవ్వలేదు. పోనీ రేపు ఆదివారం చేద్దామంటే ఒకే టైంలో సాయంత్రం వైజాగ్ లో సైంధవ్, హైదరాబాద్ లో హనుమాన్ ఈవెంట్లు జరుగుతున్నాయి. వాటితో క్లాష్ కావడం కరెక్ట్ కాదు. అందుకే సోమవారం నుంచి బుధవారం మధ్యలో ఏదో ఒక డేట్ ని లాక్ చేసుకోవాలి. ముహుర్తాలు గట్రా చూసుకోవాలి కాబట్టి అది తేల్చే విషయంలో త్రివిక్రమ్ గట్టి చర్చల్లో ఉన్నారట.

ట్రైలర్ ని రేపు రిలీజ్ చేసే ప్రతిపాదన ఉంది కానీ అది ఈవెంట్ లో చేస్తేనే కిక్ ఉంటుందన్న అభిప్రాయంలో నిర్మాత నాగవంశీ ఉన్నందు వల్ల ఏ ప్రకటన వెంటనే ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పటికప్పుడు వదిలేందుకు పోస్టర్లను సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రస్తుతం ఈవెంట్ అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీక్ డేస్ అయినా పర్వాలేదనుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏపీ తెలంగాణకు సంబంధించి గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ ని జనవరి 9 సాయంత్రం నుంచి మొదలు కావొచ్చు. మహేష్ మేనియా మాత్రం మాములుగా లేదు.

This post was last modified on January 6, 2024 5:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు,…

13 seconds ago

పుష్ప 2 OTT రిలీజ్ డేట్ వచ్చేసింది…

గత డిసెంబర్ లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ ఓటిటి రిలీజ్…

4 minutes ago

వివాదాలకు దారి చూపిస్తున్న బ్యాడ్ గర్ల్

కల్ట్ ఫిలిం మేకర్స్ గా బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ లో వెట్రిమారన్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా…

11 minutes ago

రాజమౌళి ‘తెలుగు పీపుల్’ మాటలో తప్పేముంది

అందని ఎత్తులో ఉన్న వాళ్ళను లక్ష్యంగా చేసుకునే బ్యాచ్ సోషల్ మీడియాలో అంతకంతా పెరుగుతోంది. దానికి దర్శక ధీర రాజమౌళి…

49 minutes ago

నారా లోకేశ్ వెరీ వెరీ స్పెషల్.. !!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నిజంగానే ప్రతి విషయంలోనూ వెరీ వెరీ స్పెషల్ అని…

2 hours ago

బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్

భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రచ్చ మొదలైంది.…

2 hours ago