Movie News

రిలీజ్ డేట్ల పంచాయతీ తెగలేదు

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ లో విషయంలో ఎంత పెద్ద పంచాయతీ నడిచిందో తెలిసిందే. కొన్ని వారాలుగా నడుస్తున్న ఈ పంచాయితీకి ఈ గురువారం సాయంత్రం తెరదించినట్లే కనిపించింది నిర్మాతల మండలి. ఈగల్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడంతో.. నాలుగు సినిమాలకు థియేటర్ల సర్దుబాటు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది.

ఈగల్ సినిమాకు సోలో డేట్ ఇప్పిస్తాం అన్న హామీ ప్రకారమే ఫిబ్రవరి 9ని ఓకే చేయించారు. ఆ రోజు రావాల్సిన టిల్లు స్క్వేర్ సినిమాను వాయిదా వేసుకోవడానికి గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ అంగీకరించారు. ఇంతటితో వ్యవహారం సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ మరో పెద్ద నిర్మాత ఇప్పుడు లైన్లోకి వచ్చి కొత్త వివాదానికి తెర తీశారు. ఆ నిర్మాత ఎవరో కాదు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.

అనిల్ నిర్మాణంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన కూడా ఫిబ్రవరి 9నే విడుదల కావాల్సి ఉంది. ఈ మధ్య ఆ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించారు. టిల్లు స్క్వేర్ మిడ్ రేంజ్ మూవీనే కావడంతో వాలెంటైన్స్ డే వీకెండ్లో దాంతో పోటీ పడడానికి ఊరి పేరు భైరవకోన సిద్ధమైంది. కానీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ స్థానంలోకి ఈగల్ లాంటి పెద్ద సినిమా వచ్చింది.

సంక్రాంతి సినిమాల పంచాయతీ తెంచడానికి సమావేశమైన నిర్మాతలు తనను సంప్రదించనేలేదని.. వాళ్ల పాటికి వాళ్లు సోలో డేట్ అంటూ ఈగల్ టీంకు హామీ ఇచ్చేశారని.. తాము యధాప్రకారమే ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అనిల్ సుంకర ప్రకటించారు. ఈ చిన్న సినిమాతో పోటీ తమకు పర్లేదని ఈగల్ టీం లైట్ తీసుకుంటుందా లేదంటే సోలో డేట్ హామీ ప్రకారం దాన్ని కూడా ఖాళీ చేయించాలని నిర్మాతల మండలిని డిమాండ్ చేస్తుందా అన్నది చూడాలి.

This post was last modified on January 5, 2024 4:57 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago