ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకపోయినా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం అభిమానుల ఎదురుచూవులు మాములుగా లేవు. గేమ్ ఛేంజర్ విపరీతమైన జాప్యం వల్ల ఫ్యాన్స్ ఫోకస్ మెల్లగా ఆర్సి 16 వైపు వెళ్తోంది. ఇంకా హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ తదితర వివరాలు బయటికి చెప్పడం లేదు కొన్ని లీక్స్ అఫీషియల్ గా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయం ఆయనే కెప్టెన్ మిల్లర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో బయటికి వచ్చింది.
శాండల్ వుడ్ లో ఎంత పేరున్నా ఇంత సుదీర్ఘమైన అనుభవంలో శివరాజ్ కుమార్ బయట భాషల్లో నటించలేదు. జైలర్ లో నరసింహగా కనిపించాకే ఆయన రేంజ్ ఏంటో మూవీ లవర్స్ కి అర్థమయ్యింది. అంతకు ముందు బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథ పాటలో నర్తించారు కానీ అధిక శాతం ఆడియన్స్ కి అంతగా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ లో ముఖ్యమైన క్యారెక్టర్ ఇవ్వడంతో చెన్నైలోనే మకాం వేసి పబ్లిసిటీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్సి 16లో ఉన్నానని చెప్పారు కానీ దాని తీరుతెన్నులు, ఎంతసేపు ఉంటారనే విషయాలు పంచుకోకుండా దాటవేశారు.
రాజ్ కుమార్ కుటుంబంతో చిరంజీవికి ఎంత అనుబంధం ఉన్నా ఆ ఫ్యామిలీ యాక్టర్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆ లోటుని తీర్చడం చిరునైనా సంతోషపరిచేదే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్న రామ్ చరణ్ 16ని వేసవి నుంచి ప్రారంభించాలని బుచ్చిబాబు గట్టి సంకల్పంతో ఉన్నారు. కానీ ఎదురుచూసే కొద్దీ దర్శకుడు శంకర్ తన గేమ్ ఛేంజర్ కి గుమ్మడికాయ కొట్టనివ్వడం లేదు. పల్లెటూరి నేపథ్యంతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ డ్యూయల్ రోల్ ఉంటుందనే లీక్ ఉంది కానీ
ఖచ్చితమైన సమాచారమైతే ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on January 5, 2024 11:25 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…