Movie News

తప్పుకున్న ఈగల్ – టిల్లు స్క్వేర్ త్యాగం

అనుకున్నట్టే అయ్యింది. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంటుందన్న ప్రచారమే నిజమయ్యింది. థియేటర్ల సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ లు సంయుక్తంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరిపి ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయం వెల్లడించారు. దీని ప్రకారం ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఆ డేట్ ని ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ చేసుకున్న టిల్లు స్క్వేర్ ని అక్కడి నుంచి మార్చడానికి నిర్మాత నాగవంశీ అంగీకరించడంతో పరిష్కారం సులభమయ్యింది. సో మాస్ మహారాజా నెలరోజుల తర్వాత రాబోతున్నాడు.

ఈ సందర్భంగా కౌన్సిల్ తరఫున మాట్లాడిన దిల్ రాజు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి కృతజ్ఞతలు చెప్పారు. ఒకరికొకరు అండర్ స్టాండింగ్ తో సహకరించుకోవడం వల్లే ఇది సాధ్యమయ్యిందని, మాట ఇచ్చినట్టు ఈగల్ కు సోలో రిలీజ్ వచ్చేలా ప్లాన్ చేశామని అన్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే గుంటూరు కారం, నా సామిరంగ రెండు ఊర మాస్ పండగ కంటెంట్ తో బరిలో దిగుతున్నాయి. సైంధవ్ కు వెంకటేష్ స్టార్ ఇమేజ్ తో పాటు బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ అండగా ఉంది. కంటెంట్ నే నమ్ముకున్న హనుమాన్ స్క్రీన్లు తక్కువైనా సరే తర్వాత పెరుగుతాయనే ధీమాలో ఉంది.

ఫైనల్ గా అయిదు సినిమాలకు బదులు నాలుగే రావడం పంపిణీదారులు ఊరట కలిగిస్తోంది. ఈగల్ పోస్ట్ పోన్ ఫ్యాన్స్ కోణంలో నిరాశ పరిచే అంశమే అయినా ఫిబ్రవరి మరీ బ్యాడ్ సీజన్ కాదు. గతంలో డీజే టిల్లు, భీమ్లా నాయక్, నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ నెలలో వచ్చినవే. ఈగల్ మీద ఎలాగూ అంచనాలు బాగున్నాయి. సో ఒంటరిగా రావడం ఖచ్చితంగా లాభం చేకూరుస్తుంది. ఈగల్ వదిలేసుకున్న స్క్రీన్లను సమన్యాయం పద్ధతితో పంచుతారా లేక బయట టాక్ ఉన్నట్టు నా సామిరంగకు ఇస్తారా వేచి చూడాలి. మొత్తంగా రిలీజుల డ్రామాలో క్లైమాక్స్ ఊహించినట్టే వచ్చింది.

This post was last modified on January 4, 2024 9:03 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు చిన్నవి – సినిమా చాలా పెద్దది : దిల్ రాజు

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…

25 minutes ago

రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చెప్పిందిదే…

టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…

35 minutes ago

పోలిశెట్టి టైమింగ్…రాజుగారి పెళ్లి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…

1 hour ago

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

3 hours ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

3 hours ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

4 hours ago