కెజిఎఫ్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న యష్ కొత్త సినిమా టాక్సిక్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారని ఇప్పటికే టాక్ ఉంది. ఇదిలా ఉండగా ఇందులో హీరోయిన్ గా ఎవరు చేస్తారనేది ఇంకా బయటికి చెప్పడం లేదు. లీక్స్ ని బట్టి అందుతున్న సమాచారం మేరకు ఒక ప్రధాన పాత్రకు బాలీవుడ్ నుంచి కరీనా కపూర్ ని అడిగినట్టు సమాచారం. కీలకమైన లేడీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం తనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. మెయిన్ హీరోయిన్ గా రెండు మూడు ఆప్షన్లు చూస్తున్నారు. సాయిపల్లవి, శృతి హాసన్, రష్మిక మందన్నలో ఎవరి కాల్ షీట్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఎవరికీ ఇంకా నెరేషన్ ఇవ్వలేదు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలుపెడతారనే దాన్నిబట్టి ఫైనల్ చేస్తారు. 2025లో విడుదల కాబోతున్న టాక్సిక్ గోవా కేంద్రంగా జరిగే డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. యష్ క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి రాలేదు కానీ యానిమల్ తరహాలో వైల్డ్ గా ఉంటుందని వినికిడి.
కేవలం స్క్రిప్ట్ కోసమే రెండేళ్లకు పైగా వెయిట్ చేసిన యష్ ఈ టాక్సిక్ మీద భారీ నమ్మకం పెట్టుకున్నాడు. తనకొచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ గాలివాటం కాదని శాశ్వతమని రుజువు చేసుకోవాలంటే ఇది బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. ఫిజిక్ కోసమే ఆరు నెలలు ప్రత్యేకంగా కష్టపడ్డాడు. ప్రత్యేకంగా రైఫిల్, మెషీన్ గన్ షూటింగ్ ని నిజంగానే నేర్చుకున్నాడు. మిగిలిన క్యాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదు. కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా టేకింగ్ పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
This post was last modified on January 4, 2024 6:00 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…