సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక ఆలో లక్ష్మణా అంటుంటే ఇక డబ్బింగ్ బ్యాచ్ కి చోటెక్కడిది. అందుకే జనవరి 12 తమిళనాడులో విడుదల కాబోతున్న కెప్టెన్ మిల్లర్, అయలన్ లు ఒకేసారి తెలుగులో వచ్చేందుకు ఛాన్స్ లేకపోవడంతో అనువాదాలను వాయిదా వేసుకుంటున్నాయి. హక్కులు కొన్న నిర్మాతలు దొరికిన కాసిన్ని స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో అయినా రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే వ్యవహారం సీరియస్ గా మారుతుంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కే నానా ఇబ్బందులు పడుతుంటే వీటికి సర్దటం జరగని పని.
ఈ పరిణామాలు ధనుష్, శివ కార్తికేయన్ లకు ఎంత మాత్రం మింగుడుపడటం లేదు. ఎందుకంటే ఇద్దరి మార్కెట్ 2022 నుంచి పుంజుకుంది. వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్, మహావీరుడు డీసెంట్ గా వర్కౌట్ కాగా సార్ ఏకంగా బ్లాక్ బస్టర్స్ సరసన చోటు దక్కించుకుంది. కెప్టెన్ మిల్లర్, అయలన్ రెండూ వాళ్ళ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందినవి. విజువల్ ఎఫెక్ట్స్ ని రిచ్ గా పొందుపరిచారు. తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తే వచ్చే తలనొప్పి రివ్యూలు, పైరసీ ప్రింట్లు, పబ్లిక్ టాక్ మొదలైనవి మొదటి రోజే బయటికి వస్తాయి. బాగుంటే సమస్య లేదు. తేడా కొడితేనే చిక్కు.
ఇంత జరుగుతున్నా వీలైనంత వరకు తెలుగు వెర్షన్ రిలీజ్ చేయమని ధనుష్, శివ కార్తికేయన్ తమ నిర్మాతల మీద ఒత్తిడి పెడుతున్నారని చెన్నై టాక్. కానీ వాస్తవ పరిస్థితులు తీవ్రంగా ఉన్న విషయాన్ని వివరించి చెప్పడంతో ప్రస్తుతానికి నిట్టూర్చారు కానీ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదని తెలిసింది. కెప్టెన్ మిల్లర్ ఈవెంట్ నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. అయలన్ ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించారు. మొదటిసారి టాలీవుడ్ లో డబ్బింగులకు అడ్డుకట్ట వేసిన సంక్రాంతిగా 2024 నిలిచిపోయేలా ఉంది. చివరి నిమిషంలో ఏదైనా ట్విస్టులు ఎదురైతే తప్ప.
This post was last modified on January 4, 2024 4:39 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…