Movie News

హనుమాన్ వేడుకలో మెగా ఆకర్షణలు

నువ్వా నేనా అని తలపడుతున్న సంక్రాంతి సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ పోటీ పడుతున్నాయి. గుంటూరు కారం ఈ నెల 6 యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో వేడుకను లాక్ చేసుకోగా తాజాగా హనుమాన్ 7న ఎన్ కన్వెన్షన్ లో సెలబ్రేషన్ కు సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం ఖరారయ్యింది. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు అచ్చం చిరుని పోలి ఉన్నాయని కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ఆయనే రావడం చూస్తే ఏదో లింక్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయన కాసేపు కనిపించడమో లేదా గొంతు వినిపించడమో ఉండొచ్చని భావిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం టీమ్ నుంచి అందిన లీక్స్ ని బట్టి అదేమీ లేదని తెలిసింది కానీ ఒకవేళ సర్ప్రైజ్ ఏదైనా ఉంటే వేదిక మీద తెలిసే అవకాశముంది. వ్యక్తిగతంగా చిరంజీవికి ఇష్టమైన దైవం హనుమంతుడే. అందుకే తల్లి పేరు అంజనా దేవి కావడం ఆశీర్వాదంగా ఆయన భావిస్తారు. పలు సందర్భాల్లో తాను కొలిచే దేవుడి గురించి చెప్పుకుంటూ వచ్చారు. జగదేకవీరుడు అతిలోకసుందరిలో కాసేపు హనుమంతుడి గెటప్ లో ఫైటింగ్ గట్రా చేసి అలరించారు. ఒక కార్టూన్ మూవీ తెలుగు అనువాదానికి స్వయంగా డబ్బింగ్ చెప్పి అప్పట్లో దానికి ఓపెనింగ్స్ వచ్చేలా దోహదపడ్డారు.

వీటితో పాటు హనుమాన్ హీరో తేజ సజ్జకు, చిరుకి స్క్రీన్ కనెక్షన్ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉందిలో కొడుకుగా, ఇంద్రలో చిన్నప్పటి ఇంద్రసేనారెడ్డిగా బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఆయనే గెస్టుగా రావడం కంటే ఉద్వేగం తేజకు ఇంకేముంటుంది. విపరీతమైన ఒత్తిడి మధ్య థియేటర్లను దక్కించుకోవడంలో చాలా కష్టపడుతున్న హనుమాన్ కు బజ్ తగినంత ఉంది కానీ స్టార్ హీరోలవి కాదని ఆడియన్స్ దీనికి రావాలంటే భక్తి సెంటిమెంట్ తో అదనపు హంగామాలు అవసరమే. ఇక్కడ కంటే ఉత్తరాదిలో భారీ ఎత్తున రిలీజవుతున్న హనుమాన్ కి బాలీవుడ్ లో కాంపిటీషన్ లేదు.

This post was last modified on January 3, 2024 7:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

9 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago