సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలతో అభిమానులు దగ్గరయ్యే అవకాశం మరింత పెరిగింది. అధిక సందర్భాల్లో ఇది ప్రయోజనం కలిగించినా సమస్యలు తెచ్చిన దాఖలాలు లేకపోలేదు. నిన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్ లో ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. నిర్మాత నాగవంశీని ఆహ్వానిస్తే దానికి హాజరై ఆడియో రూపంలో ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకటి రెండు థియేటర్లున్న సింగల్ స్టేషన్లలో గుంటూరు కారం విడుదల గురించి ఆందోళన పడుతున్న విషయం ఆయన దృష్టికి తెచ్చారు. సైంధవ్ కోసం స్క్రీన్లు బ్లాక్ చేస్తారనే అనుమానం వ్యక్తం చేశారు.
దీనికి నాగవంశీ స్పందిస్తూ అలాంటిదేమి లేదని, ఎక్కడ సమస్యలు రాకుండా మంచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నామని, స్వంత హీరో కాబట్టి సైంధవ్ కోసం సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్లానింగ్ కి తానెలా అడ్డుపడగలనని, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాది పెద్ద సినిమా కాబట్టి సహకరించమని ఎలా అడగాలని సమాధానం చెప్పారు. ఇక్కడిదాకా బాగానే ఉంది ఆయన ఫ్లోలో అన్న మాటలు సైంధవ్ ఏదో చిన్న సినిమా అని అర్థం వచ్చేలా ఉండటంతో ఒక్కసారిగా వెంకటేష్ ఫ్యాన్స్ కి కోపం వచ్చేలా చేసింది. దీంతో నాగవంశీని ట్యాగ్ చేస్తూ ఆన్ లైన్లో దూషణల దండకం అందుకున్నారు.
వీళ్లకు ధీటుగా మహేష్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు కానీ నిజానికి నాగవంశీ అన్న మాటలకు అర్థాలను వివిధ కోణాల్లో అన్వయించడంతో ఈ తిప్పలొచ్చి పడింది. జనవరి 8 తర్వాత థియేటర్ల కేటాయింపు గురించి క్లారిటీ వస్తుందని, అప్పటిదాకా అనవసరంగా టెన్షన్ పడొద్దని పదే పదే చెబుతున్నా ప్రశ్నలు రిపీట్ కావడంతో ఆయన అన్న సమాధానం కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. దీంతో వెంకీ మహేష్ ఫ్యాన్స్ నువ్వా నేనా అనే తరహాలో ఆర్గుమెంట్లు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే నాగవంశీ ఇదంతా గమనించే ఉంటారు కాని ఎలా తిరిగి స్పందిస్తారేమో చూడాలి.
This post was last modified on January 3, 2024 12:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…