గత కొంత కాలంగా వరసగా ఎఫ్2, ఎఫ్3, ఓరి దేవుడా లాంటి ఎంటర్ టైనర్స్ తో నవ్వించే పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన విక్టరీ వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత ఊర మాస్ యాక్షన్ అవతారంలో సైంధవ్ గా రాబోతున్నాడు. నారప్పలో సీరియస్ క్యారెక్టర్ చేసినప్పటికీ అది ఓటిటి రిలీజ్ కావడంతో అభిమానులు అంతగా సంతృప్తి చెందలేదు. బిగ్ స్క్రీన్ మీద గణేష్ ని మించిన విశ్వరూపాన్ని ఆశిస్తున్నారు. అందుకే శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైంధవ్ మీద ప్రాజెక్టు ప్రారంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. జనవరి 13 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ చేశారు.
గారాల కూతురే ప్రాణంగా బ్రతికే సైంధవ్(వెంకటేష్) తనకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. ఓ రోజు స్కూల్లో పాప హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అది ప్రమాదకరమైన నరాల వ్యాధని, బ్రతకాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు చెబుతారు. అప్పటిదాకా శాంతంగా జీవితాన్ని గడుపుతున్న సైంధవ్ హింసాత్మకమైన తన గతాన్ని తవ్వుతాడు. ఈ క్రమంలోనే మెడికల్ వ్యాపారంలో ఉన్న పాత్ర శత్రువులు(నవాజుద్దీన్ సిద్ధిక్-ముఖేష్ ఋషి)లతో తలపడాల్సి వస్తుంది. మనుషులను నల్లుల కంటే దారుణంగా చంపే పరిస్థితి వస్తుంది. అదెలాగో థియేటర్లోనే చూడాలి.
విజువల్స్ మొత్తం యాక్షన్ కంటెంట్ తో నిండిపోయాయి. ఫ్యాన్స్ అంచనాలకు మించి వెంకటేష్ చేసే రక్తపాతం మాములుగా లేదు. స్టోరీని దాచకుండా ట్రైలర్ లోనే రివీల్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇంత సీరియస్ సబ్జెక్టుని కమర్షియల్ కోటింగ్ తో చెప్పే ప్రయత్నం చేయడం సాహసమే. శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియాలతో పాటు నవాజుద్దీన్ సిద్ధిక్ ల క్యారెక్టర్లు మంచి ఇంటెన్స్ తో కనిపిస్తున్నాయి. మణికందన్ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం రెండూ ఎలివేట్ అయ్యాయి. సరిగ్గా ఇంకో పది రోజుల్లో తెరమీద సైంధవ్ ఊచకోత మొదలవుతుంది.
This post was last modified on January 3, 2024 11:32 am
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…