Movie News

ఒక్క స్తోత్రంతో అంచనాలు మారిపోతున్నాయి

గుంటూరు కారం లాంటి ఊర మాస్ మహేష్ బాబు సినిమాను ఎదురుగా పెట్టుకుని అదే రోజు జనవరి 12న తలపడుతున్న హనుమాన్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. ట్రైలర్ కావాల్సినంత బజ్ తీసుకొచ్చింది. ఇంకో వెర్షన్ సిద్ధం చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేయబోతున్నారు. మ్యూజిక్ పరంగా ఇప్పటిదాకా హనుమాన్ నుంచి వచ్చిన పాటలు బాగానే బజ్ పెంచాయి కానీ తాజాగా విడుదల చేసిన శ్రీ రామదూత స్తోత్రం మాత్రం హైప్ ని పూర్తిగా మార్చేలా ఉంది. గౌరహరి కంపోజింగ్ లో సాయిచరణ్, లోకేశ్వర్, హర్షవర్ధన్ గాత్రంలో హనుమంతుడి గుణగణాలు, బలాలు వర్ణించిన తీరు బాగుంది.

ఇది కొత్తగా రాసింది కాదు. హనుమత్ స్తోత్ర సాహిత్యం నుంచి తీసుకున్నారు. పదాలను ఉచ్చరించిన తీరు, బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే సౌండ్, వీటికి తగ్గట్టు అంజనీ పుత్రుడి జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలతో పాటు సినిమా స్టోరీకే సంబంధించిన కొన్ని సీన్లను ఎఫెక్ట్స్ సహాయంతో వీడియో రూపంలో పొందుపరచడం ఆకట్టుకునేలా ఉంది. ఆదిపురుష్ విడుదలకు ముందు ఆడియో ఆల్బమ్ వైపు నుంచి జరిగిన కంట్రిబ్యూషన్ చాలా పెద్దది. ముఖ్యంగా జై శ్రీరామ్ గీతం భక్తి ప్రియులను పరవశంలో ముంచెత్తింది. సినిమా ఫలితం నిరాశ పరిచినా సంగీతం మాత్రం హిట్టు కొట్టింది.

హనుమాన్ ఈ విషయంలో జాగ్రత్త పడి కంటెంట్ ప్లస్ మ్యూజిక్ రెండూ బాలన్స్ అయ్యేలా ప్లాన్ చేసుకున్న విధానం వర్కౌట్ అయ్యేలానే ఉంది. మరో నాలుగు పెద్ద సినిమాల మధ్య పోటీని ఎదురుకుంటున్న హనుమాన్ కి హిందీ మార్కెట్ చాలా కీలకం కానుంది. అందుకే స్తోత్రం తాలూకు లిరిక్స్ ని అదే భాషలో పొందుపరిచారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ రిజల్ట్ పట్ల చాలా ధీమాగా కనిపిస్తున్నాడు. ఫ్యామిలీస్ మొదటి ఛాయస్ ఖచ్చితంగా తమదే అవుతుందనే నమ్మకాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నాడు. కాంపిటీషన్ ఎంత ఉన్నా ఫైనల్ గా మాట్లాడేది కంటెంటే. అది అంచనాలు అందుకుంటే గెలిచినట్టే.

This post was last modified on January 3, 2024 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

33 minutes ago

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి…

4 hours ago

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

6 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

11 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

12 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

13 hours ago