సలార్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా లేక బాక్సాఫీస్ కొంత డల్లుగా ఉంది. అదొచ్చి పది రోజులు దాటేసింది. ప్రేక్షకులు భారీగా చూసేశారు. అందుకే 29న విడుదలైన డెవిల్ కు మంచి ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేసింది. డివైడ్ టాక్ సంగతి పక్కనపెడితే వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది. రిలీజ్ రోజు కంటే న్యూ ఇయర్ డేకి ఎక్కువ కలెక్షన్లు నమోదు కావడమే దానికి నిదర్శనం. మొదటి మూడు రోజులకు కేవలం అయిదు కోట్ల షేర్ మాత్రమే నమోదు చేసిన డెవిల్ నిన్న ఒక్క రోజే రెండున్నర కోట్లకు పైగా రాబట్టడం విశేషం. సలార్ తర్వాత అధిక ఆక్యుపెన్సీలు కళ్యాణ్ రామ్ కే కనిపించాయి.
ఇప్పటిదాకా వచ్చిన మొత్తం చూసుకుంటే ఏడు కోట్ల షేర్ దాటేయడం మంచి పరిణామం. అయితే టార్గెట్ ఇంకా దూరం ఉంది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇరవై కోట్లు రాబట్టాలి. ఇది అంత సులభం కాదు. పర్వాలేదనే మాట పబ్లిక్ నుంచి రావడంతో క్రమంగా కలెక్షన్లు మెరుగు పడుతున్నాయి. నిన్న సెలవు రోజు కావడం వల్లే నెంబర్లు పెరిగాయన్నది వాస్తవమే కానీ ఇవాళ్టి నుంచి రాబోయే ఆదివారం దాకా కాస్త హోల్డ్ చేసుకోగలిగితే గట్టెక్కే అవకాశాలు పెరుగుతాయి. బబుల్ గమ్, సర్కారు నౌకరి లాంటివి జనాన్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.
సో డెవిల్ కు ఇంకో పది రోజులు చేతిలో ఉన్నాయి. సరిగ్గా వాడుకుంటే లాభాలు కాకపోయినా కనీసం నష్టాలు రాకుండా సేఫ్ కావొచ్చు. ముందైతే టీమ్ ప్రమోషన్ల స్పీడ్ పెంచాలి. పోస్టర్లతో సరిపెట్టకుండా ఇంకేదైనా వినూత్నంగా ఆలోచించాలి. ఫ్యాన్స్ సక్సెస్ టూర్ లాంటివి డిమాండ్ చేస్తున్నారు కానీ టీమ్ అంత సుముఖంగా లేదట. దాని స్థానంలో ఏదైనా ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఉంది కానీ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అభిషేక్ నామా దర్శకత్వం ప్లస్ నిర్మాణంలో రూపొందిన డెవిల్ బృందం ప్రస్తుతం ఇంటర్వ్యూల ద్వారా పబ్లిసిటీ చేయడంలో బిజీగా ఉంది.
This post was last modified on January 2, 2024 6:28 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…