ఇవాళ విశ్వక్ సేన్ తన రైటింగ్ అండ్ ప్రొడక్షన్ లో కొత్త నటీనటులతో ‘కల్ట్’ సినిమాని ప్రకటించాక అందరికీ ఒక్కసారిగా నిర్మాత ఎస్కెఎన్ గుర్తొచ్చారు. కారణం కొద్దిరోజుల క్రితం ‘కల్ట్ బొమ్మ’ టైటిల్ తో ఒక మూవీ తీయబోతున్నట్టు ఆయనే చెప్పడం వల్ల. అయితే కాకతాళీయంగా జరిగిందా లేక ఇంకేదైనా మతలబు ఉందో ఏమో కానీ వ్యవహారం మీడియా ద్వారా ఎస్కెఎన్ దాకా వెళ్లిపోయింది. సాధారణంగా ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఎవరైనా సరే టైటిల్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా దాని మీద హక్కులను సొంతం చేసుకుంటారు. అలా చేయకుండా వేరొకరు వాడుకుంటే ఏం చేయలేరు.
దీనికి సంబంధించి ఎస్కెఎన్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కల్ట్ బొమ్మను కొన్ని నెలల క్రితమే రిజిస్టర్ చేయించానని, అందుకే ప్రకటించానని స్పష్టం చేశారు. సో ఏదో ఫ్లోలో హఠాత్తుగా చెప్పిన అనౌన్స్ మెంట్ కాదనే సంగతి తేటతెల్లం చేశారు. ఇలా కొద్దిపాటి మార్పులు లేదా పొడిగింపులతో ఒకటే టైటిల్ ఉండటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కల్ట్, కల్ట్ బొమ్మలో రెండు అక్షరాల వ్యత్యాసం ఉన్నా సరే కామన్ ఆడియన్స్ కొంత అయోమయంకి గురయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎస్కెఎన్ పక్కాగా పేరుని నమోదు చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇష్యూ ఉండకపోవచ్చు.
బేబీ విడుదల టైంలో ప్రీమియర్ చూసి బయటికి వచ్చిన ఆనందంలో ఎస్కెఎన్ మీడియా కెమరాల ముందు కల్ట్ బొమ్మతో హిట్టు కొట్టాం అని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. కట్ చేస్తే బొమ్మ నిజంగానే బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో వెంటనే అదే పేరుని రిజిస్టర్ చేయించేశారు. ప్రస్తుతం ఈయన నిర్మాణ భాగస్వామ్యంలో నాలుగు సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటిలో దేనికి పెడతారో ఇంకా క్లారిటీ లేదు కానీ కొంత వెయిట్ చేసి చూడాలి. అన్నట్టు విశ్వక్ సేన్ కల్ట్ ముందు హాష్ ట్యాగ్ సింబల్ తో పాటు కిందొక క్యాప్షన్ కూడా పెట్టారు. ముందు జాగ్రత్త చర్యలో భాగమేమో కొద్దిరోజులు ఆగితే స్పష్టత వస్తుంది.
This post was last modified on December 31, 2023 1:23 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…