చిన్న ప్రోమోకే పెద్ద చర్చకు దారి తీసిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి ఫుల్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. మూడున్నర నిమిషాలున్న పాటను తమన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ‘రాజమంజరి మా అమ్మ పేరు తెలియనోళ్లు లేరు మేస్తిరి’ అంటూ పక్కా నాటు స్టైల్ లో సాగే లిరిక్స్ తో మహేష్ బాబు, శ్రీలీల వేసిన స్టెప్పులు మాములు హుషారు ఇచ్చేలా లేవు. మడతకు సంబంధించిన బీట్స్, ర్యాంప్ ని డీజే హరీష్ కంపోజ్ చేశాడు. సాహితి చాగంటి, శ్రీకృష్ణల గాత్రంతో పాటు మధ్యలో మహేష్ బాబు మాటలు కూడా ఉండటం మరో ఆకర్షణగా చెప్పొచ్చు.
కుర్చీకి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో ఇంకా ఫ్రెష్ గా ఉండగానే ఇప్పుడొచ్చిన ఫుల్ వెర్షన్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ఉంది. మధ్యలో ఈ బీట్ ని పదే పదే వినిపించడం, స్వయంగా మహేషే ఎవరి లిరిక్స్ వాళ్ళే రాసుకుని ఎంజాయ్ చేయండని అర్థం వచ్చేలా చెప్పడం టీమ్ ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతోంది. ఓ మై బేబీ టైంలో రేగిన అసంతృప్తి, వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ట్రిగ్గర్ చేయడం కోసం హీరోతోనే రెండు మాటలు చెప్పించడం పేలింది. ఇవన్నీ పక్కనపెడితే మహేష్ ని ఇంత హై ఎనర్జీతో డాన్స్ చేయడం చూసి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టమే.
మొత్తానికి అంచనాలు పెంచేలా సాంగ్ ని తీసుకొచ్చేశారు. అభిమానులు ఫుల్ మీల్స్ లా ఫీలయ్యే రేంజ్ లో ఉంది. శాంపిల్ గా వదిలిన వీడియోలోనే ఇంత హంగామా చేస్తే ఇక థియేటర్ లో మొత్తం చూస్తే ఆగడం కష్టమే. అందుకే కాబోలు నిర్మాత నాగవంశీ సందర్భం వచ్చిన ప్రతిసారి ఊగిపోతారని తెగ ఊరిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో స్పెషల్ సాంగ్స్ తీశారు కానీ మరీ ఇంత మాస్ ని పెట్టడం కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ తమన్ ట్యూన్ మీద మాత్రం మిశ్రమ స్పందన వచ్చే అవకాశం లేకపోలేదు. ఒక రోజు ఆగి చూస్తే స్పందనలను బట్టి మ్యాటరేంటో తేలిపోతుంది.
This post was last modified on December 30, 2023 7:33 pm
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…