మెగాస్టార్ అభిమానుల దృష్టంతా ప్రస్తుతం ‘విశ్వంభర’ మీదే ఉంది. ‘భోళాశంకర్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న చిరు.. దాని తర్వాత చేస్తున్న చిత్రమిదే. నిజానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి మరీ చిరు ఈ చిత్రంలోనే నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నవంబర్లో ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు వశిష్ఠ. ఆ షెడ్యూల్ చిరు లేకుండానే మొదలు కావడం విశేషం. మెగాస్టార్ లేకుండానే ఈ షెడ్యూల్ పూర్తిగా లాగించేశారట. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ఆరంభం కాబోతోంది. ఆ షెడ్యూల్లో కూడా చిరు వెంటనే జాయిన్ కావట్లేదని సమాచారం.
చిరుకు మోకాళ్ళ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దాన్నుంచి ఆయన నెమ్మదిగా కోరుకుంటున్నారు. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఓవైపు ఫిట్నెస్ కసరత్తులు చేస్తూనే.. మరోవైపు విశ్వంభరకు అవసరమైన లుక్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు మెగాస్టార్. అందుకు ఇంకో నెల రోజులు సమయం పడుతుందని సమాచారం. జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఆయన అందుబాటులోకి వస్తారట. అక్కడి నుంచి ఆయన విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొంటాడట. అప్పటివరకు చిరుతో సంబంధంలేని సన్నివేశాలనే చిత్రీకరించబోతున్నారు.
ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. దర్శకుడు వశిష్ఠ కూడా ఆ మధ్య ‘విశ్వంభర’ జానర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రస్తావన తెచ్చాడు. మెగాస్టార్ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ మూవీలో నటించి మూడు దశాబ్దాలు అవుతోందనీ… ‘విశ్వంభర’లో మళ్ళీ అలాంటి అందమైన ప్రపంచాన్ని చూపిస్తామని.. ఈ చిత్రంలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అతను చెప్పాడు.
This post was last modified on December 27, 2023 9:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…