చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయిన సంగతి తెలిసిందే. ఇంకా హీరో ఎంట్రీ జరగలేదు. ప్యాడింగ్ ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలతో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. మెగాస్టార్ సంక్రాంతి తర్వాత జాయినవుతారనే వార్త వచ్చింది కానీ ఇప్పుడది ఫిబ్రవరి కావొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మెగా ప్యాన్ ఇండియా మూవీలో ముందు విలన్ గా దగ్గుబాటి రానాని అనుకున్న సంగతి తెలిసిందే. ప్రాధమికంగా కథా చర్చలు జరిగి ఓకే అనేసుకున్నారు. అయితే డేట్ల సమస్యతో పాటు ఇతరత్రా కారణాల వాళ్ళ రానా డ్రాప్ అయ్యాడట.
తాజాగా భల్లాలదేవా స్థానంలో బాలీవుడ్ విలన్ కునాల్ కిషోర్ కపూర్ ని తీసుకున్నట్టు అప్డేట్. ఇతనికిది డెబ్యూ కాదు. గతంలో నాగార్జున నాని దేవదాస్ లో తెరంగేట్రం చేశాడు. సైమా అవార్డుకు నామినేట్ అయ్యాడు కానీ పురస్కారం దక్కలేదు. కానీ మూవీ ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో మళ్ళీ తెలుగులో కనిపించలేదు. అమీర్ ఖాన్ రంగ్ దే బసంతి నుంచే ఆడియన్స్ కి పరిచయమున్న కునాల్ కపూర్ పంతొమ్మిదేళ్ళ సుదీర్ఘ కెరీర్ లో చేసింది చాలా తక్కువ సినిమాలు. ఇప్పుడు విశ్వంభర కనక క్లిక్ అయితే కెరీర్ పరంగా మరో ఇన్నింగ్స్ ని టాలీవుడ్లో మొదలుపెట్టొచ్చు.
యూనిట్ ఏదీ అఫీషియల్ గా చెప్పడం లేదు. త్రిషను లాక్ చేసుకోవడం, ఇప్పుడు కునాల్ వచ్చి చేరడం, మారేడుమిల్లిలో కొంత పూర్తి కావడం ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండా కానిస్తున్నారు. సంక్రాంతికి టైటిల్ అనౌన్స్ మెంట్ కి అధికారికంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫోటో షూట్ నుంచి ఒక చిరు స్టిల్ తీసుకుని ఫస్ట్ లుక్ వదిలే ఆలోచన చేస్తున్నారు కానీ ఎంత వరకు నిజమవుతుందో చెప్పలేం. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న విశ్వంభరలో మరో ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలియాల్సి ఉంది. అనుష్క, మృణాల్ ఠాకూర్ ఇలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on December 27, 2023 6:44 pm
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…