బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక్క సినిమాతో ఇంత రైజ్ ఎవరు చూసి ఉండరేమో. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఒక్కో సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఇంకా చెక్కుచెదరలేదని తాజాగా సలార్ సినిమా రుజువు చేస్తోంది. ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే 180 కోట్లు, రెండు రోజుల్లో 300 కోట్లు వసూళ్లు సాధించడం అంటే మాటలు కాదు. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ఆధిపత్యాన్ని చాటే అనేక రికార్డులు ఈ సినిమా నమోదు చేసింది.
నార్త్ అమెరికాలో సోలో హీరో సినిమాతో ఐదు మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా సలార్ తో మరోసారి ప్రభాస్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే బాహుబలి 1, 2.. సాహో చిత్రాలతో అతను ఈ ఘనత సాధించాడు. తాజాగా సలార్ కూడా ఈ క్లబ్ లోకి అడుగు పెట్టింది. తెలుగు నుంచి ప్రభాస్ సినిమాలు కాకుండా ఆర్ఆర్ఆర్ మాత్రమే ఈ ఘనత సాధించింది. ఇక ఓవరాల్ గా టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్లలో వరుసగా ఐదు స్థానాల్లో ప్రభాస్ సినిమాలే ఉండడం విశేషం.
తొలి రెండు స్థానాల్లో బాహుబలి- 2, బాహుబలి- 1 ఉండగా.. సలార్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. సాహో, ఆది పురుష్ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. డిజాస్టర్ సినిమాలతోనూ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబట్టడం ప్రభాస్ కే చెల్లింది. ఇప్పటికే 400 కోట్ల మైలురాయిని దాటేసిన సలార్ ఫుల్ రన్లో 1000 కోట్ల మార్కుకు చేరువ చెరువు అంటే చెరువుగా వెళ్లే అవకాశం ఉంది.
This post was last modified on December 27, 2023 6:44 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…