సినిమాలకు ప్రి రిలీజ్ ప్రమోషన్ల పరంగా గతంలో ఆడియో వేడుకలు కీలకంగా ఉండేవి. చాలా ఏళ్ల పాటు అదే ట్రెండ్ కొనసాగింది. కానీ తర్వాత తర్వాత ఆడియోలకు ప్రాధాన్యం తగ్గి.. ప్రమోషనల్ ఈవెంట్ల రూపు మారింది. కొత్తగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని తెరపైకి వచ్చింది. దశాబ్ద కాలానికి పైగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే నెమ్మదిగా ఇవి కూడా మొనాటనస్ గా తయారై ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. ఒకే రకం డ్యాన్సులు, ఏవీలు, స్పీచ్ లు, పొగడ్తలతో ఈ ఈవెంట్లు బోర్ కొట్టించేస్తున్నాయి. ప్రేక్షకులు వీటి పట్ల ఆసక్తి కోల్పోతున్నారు. భారీగా ఖర్చుపెట్టి చేసే ఈవెంట్ల వల్ల నిజంగా సినిమాలకు ప్రయోజనం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలకు ప్రి రిలీజ్ ఈవెంట్లను క్యాన్సిల్ చేసేస్తుండగా.. పెద్ద తేడా ఏమి కనిపించడం లేదు.
ఇలాంటి ఈవెంట్లేమీ చేయకపోయినా కొన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అందుకు ఉదాహరణ లియో, సలార్ లాంటి చిత్రాలే. ఈ రెండు చిత్రాలకు ఏ భాషలోనూ ఆడియో వేడుకలు కానీ, ప్రి రిలీజ్ ఈవెంట్లు కానీ చేయలేదు. వేరే రకమైన ప్రమోషన్లు కూడా పెద్దగా జరగలేదు. అయినా సరే వీటికి రావాల్సిన దానికంటే ఎక్కువ హైపే వచ్చింది. ఓపెనింగ్స్ మోత మోగిపోయింది. దీంతో ప్రి రిలీజ్ ఈవెంట్లు వేస్ట్ అనే అభిప్రాయం బలపడుతోంది.
ఈ ట్రెండ్ చూసి డెవిల్ అనే మీడియం సినిమాకి కూడా ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. హీరో కళ్యాణ్ రామ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తప్ప ఇంకే రకమైన ఈవెంట్ చేయకుండానే సినిమాను రిలీజ్ చేయిస్తున్నాడు. ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు తెచ్చుకుని సక్సెస్ అయితే మున్ముందు మొత్తంగా ప్రి రిలీజ్ ఈవెంట్లు ఆగిపోతే ఆశ్చర్యం లేదు.
This post was last modified on December 27, 2023 2:48 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…